అక్కినేని నాగచైతన్య స్పెషల్ ఇంటర్వ్యూ
వినాయకచవితి కానుకగా వస్తున్న శైలజారెడ్డి అల్లుడు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నాగచైతన్య. తన కెరీర్ లోనే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ చేశానని అంటున్న చైతన్య.. సినిమా సంగతుల్ని మీడియాతో పంచుకున్నాడు.
వినాయకచవితి కానుకగా వస్తున్న శైలజారెడ్డి అల్లుడు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నాగచైతన్య. తన కెరీర్ లోనే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ చేశానని అంటున్న చైతన్య.. సినిమా సంగతుల్ని మీడియాతో పంచుకున్నాడు.
ఈ క్యారెక్టర్ నాకు కొత్త ఇప్పటివరకు ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ చేయలేదు. శైలజారెడ్డి సినిమాతో ఆ అవకాశం దక్కింది. ఇక మారుతి స్టయిల్కు నా బాడీలాంగ్వేజ్ పెద్దగా సూట్ కాదు. ఆయన పాత్రలు ఎక్స్ ప్రెసివ్ గా, హ్యూమరస్ గా ఉంటాయి. అందుకే ఈ పాత్ర కొత్తగా అనిపించింది. ఎలాంటి బలహీనతలు ఉండవు. ఈమధ్య కాలంలో మారుతి సృష్టించిన హీరో పాత్రలన్నింటికీ ఓ బలహీనత ఉంటూ వచ్చింది. మతిమరుపు, ఓసీడీ, అతి మంచి లాంటి లక్షణాలు ఉండేవి. కానీ శైలజారెడ్డి అల్లుడులో మాత్రం నా పాత్రకు అలాంటి బలహీనతలు ఉండవు. చాలా కూల్ గా ఉంటుంది. సింపుల్ గా సినిమా స్టోరీ మూవీలో ఇగో లేని క్యారెక్టర్ నాది. కానీ నా చుట్టూ ఉన్న పాత్రలన్నీ ఫుల్ ఇగోతో ఉంటాయి. సరిగ్గా అక్కడే కామెడీ పండుతుంది. ఇగో వల్ల సంబంధాలు ఎలా దెబ్బతింటాయి, ఇగో లేకపోతే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందనే విషయాన్ని చూపిస్తున్నాం. నేను కాలేజ్ చదువు పూర్తిచేసి, మా నాన్న కంపెనీలో జాబ్ చేస్తుంటాను. ఓవైపు ఆయన ఇగోను భరిస్తున్న టైమ్ లో ఇగోతో ఉన్న హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ తల్లి ఇగో కూడా యాడ్ అవుతుంది. వీళ్లందర్నీ నేను ఎలా మార్చాననే విషయాన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పాం.
ఎమోషన్ తో పాటు వినోదం కూడా
ఇప్పటివరకు వచ్చిన అత్తా-అల్లుడు కథలన్నీ ఎత్తు-పైఎత్తు కాన్సెప్టుతో వచ్చాయి. కానీ శైలజారెడ్డి అల్లుడు అలా ఉండదు. ఎక్కువ ఎమోషన్స్ మీద నడుస్తుంది సినిమా. అలాఅని సినిమాలో వినోదం తగ్గదు.
కామెడీతో పాటు యాక్షన్ కూడా కేవలం లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సినిమాలో యాక్షన్ డోస్ కూడా ఉంది. మూవీలో 2 యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. ఫస్టాఫ్ లో ఓ చిన్న యాక్షన్ సీన్ ఉంది. సెకండాఫ్ లో మాత్రం హై-ఎమోషన్ యాక్షన్ సీన్ ఉంది. ప్రీ-క్లయిమాక్స్ లో అది వస్తుంది.
నిర్మాత కూడా కూల్
నాకు నిర్మాత చినబాబు గారు బాగా ఇష్టం. ఆయన జడ్జిమెంట్ బాగుంటుంది. యూనిట్ ను సపోర్ట్ చేయడంలో ముందుంటారు. ఎడిట్ రూమ్ లో ఏదైనా నచ్చకపోతే వెళ్లి రీషూట్ చేయమని చెబుతారు. అలాంటి డెసిషన్ మేకింగ్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం. చినబాబు గారి బ్యానర్ లో వర్క్ చేయడానికి ఎప్పుడూ రెడీ
సమంత సినిమా కూడా హిట్టవ్వాలి
సమంత సినిమాతో పోటీ అని చాలామంది అంటున్నారు. అలాంటిదేం లేదు. నిజానికి మాకంటే ముందే వాళ్లు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మేమే వచ్చి వాళ్ల తేదీకి ల్యాండ్ అయ్యాం. సేమ్ డేట్ కు వస్తున్నామని సమంతకు చెప్పినప్పుడు ఓ రకమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. యూటర్న్, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు రెండూ డిఫరెంట్ జానర్స్. కాబట్టి రెండూ ఆడతాయి.
ప్లాన్స్ అన్నీ వర్కవుట్ అవ్వవు కదా..
సినిమాలన్నీ ప్లాన్ చేసే స్టార్ట్ చేస్తాం. సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు రెండూ పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసే దిగాను. ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ ఏడాది గ్యాప్ వచ్చేసింది. అన్నీ మన చేతిలో ఉండవు కదా. నిజానికి సవ్యసాచే ఫస్ట్ రిలీజ్ అనుకున్నాం. కానీ చాలా గ్రాఫిక్ వర్క్ పెండింగ్ లో ఉండడంతో అది లేట్ అయింది, శైలజారెడ్డి అల్లుడు ముందుకు వచ్చింది.
నిజమే.. సమంత నన్ను డామినేట్ చేసింది
ప్రమోషన్ విషయంలో సమంత నన్ను డామినేట్ చేసింది. ఈ విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసి, డాన్స్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేసింది. ప్రచారం విషయంలో సమంతను చూసి నేను చాలా నేర్చుకోవాలి.
మారుతి మార్క్ అక్కడ కనిపిస్తుంది. నా కాంబినేషన్ లో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అవుతుంది. మారుతి మార్క్ అక్కడే కనిపిస్తుంది. ఫస్టాఫ్ లో మేమిద్దరం ఆడుకుంటాం. సెకెండాఫ్ నుంచి పృధ్వి ఎంటర్ అవుతాడు. వెన్నెల కిషోర్ పాత్రను ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా డిజైన్ చేశాం. సినిమా చూసి అదేంటో మీరే తెలుసుకోండి.
ప్రతి హీరో మరో హీరోకు పోటీనే
గీతగోవిందం సక్సెస్ అనేది నాకు త్రెట్ కాదు. విజయ్ దేవరకొండ తన టాలెంట్ ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎవరికి ఎవరూ త్రెట్ కాదు. అల్టిమేట్ గా కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఈ విషయంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఎప్పటికప్పుడు హార్డ్ వర్క్ చేయడమే నా పాలసీ. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. కొత్తగా ట్రై చేస్తున్నారు. నా దృష్టిలో ప్రతి హీరోకు త్రెట్ ఉంది. అందరూ కష్టపడాలి, కొత్తగా ట్రై చేయాలి. నేను కూడా అదే చేస్తున్నాను.
ప్రేమతోనే తిడతారు. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలకు బాగా కనెక్ట్ అయ్యాను. కానీ నేను అలాంటి పాత్రలకు సూట్ అవుతానని అనుకోను. దానికింకా చాలా టైం ఉంది. ఇక నాపై నెగెటివ్ కామెంట్స్ విషయానికొస్తే, నామీద ప్రేమతోనే అభిమానులు నాపై నెగెటివ్ గా రాస్తున్నారని నా ఫీలింగ్. ఆ నెగెటివ్ కామెంట్స్ ను కూడా పాజిటివ్ గా తీసుకొని, నన్ను నేను మార్చుకుంటాను.
అప్ కమింగ్ మూవీస్
సవ్యసాచి సినిమా ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. 20వ తేదీకి అది పూర్తిచేస్తాను. నవంబర్ చివరి వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. శివనిర్వాణ సినిమా అక్టోబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతుంది. ఇక వెంకీ మామ సినిమా అక్టోబర్ నెలాఖరు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలే.
అది నాన్న సినిమా
ఇక చిలసౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నాగార్జున కోసం ఓ కథ రెడీ చేస్తున్నాడు. అదింకా స్క్రిప్టింగ్ స్టేజ్ లోనే ఉంది. మన్మధుడు సినిమాతో సంబంధం లేకపోయినా ఆ ఛాయల్లో ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మన్మధుడు-2 అనే టైటిల్ పెడతారు.
బంగార్రాజు ఫ్రాంచైజీ
బంగార్రాజు పాత్రను ఓ ఫ్రాంచైజీలా ప్లాన్ చేస్తున్నాం. ఆ క్యారెక్టర్ తో రెండేళ్లకు ఓ సినిమా చేయాలనేది ప్లాన్. నేను, నాన్న కలిసి బంగార్రాజు క్యారెక్టర్ తో ఓ సినిమా చేయాలి. కొన్నాళ్ల తర్వాత నాన్న, అఖిల్ కలిసి అదే క్యారెక్టర్ తో మరో సినిమా చేయాలి. అలా బంగార్రాజు పాత్రను ఓ ఫ్రాంచైజీగా మార్చాలనేది ఆలోచన. ప్రస్తుతానికి ఇంకా అది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది.
మారుతి ఒప్పుకోలేదు
శైలజారెడ్డి అల్లుడు సినిమాతో నాకు యువసామ్రాట్ అనే టైటిల్ వేస్తున్నారు. ఇది మారుతి తీసుకున్న నిర్ణయమే. నేను వద్దని వారించాను. కానీ మారుతి ఒప్పుకోలేదు. ఈ సినిమాతో ఈ టైటిల్ కు జస్టిఫికేషన్ వస్తుందని అన్నారు. మారుతి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నేను కాదనలేకపోయాను. ఆ టైటిల్ పెట్టడానికి ఈ సినిమా కరెక్ట్.
సమంత బిజీ.. ఐయామ్ హ్యాపీ
సమంత విషయానికొస్తే,, పెళ్లి తర్వాత ఆమె కెరీర్ ఎలా సాగుతుందో అనే భయం ఉండేది. కానీ పెళ్లి తర్వాత ఆమె మరింత బిజీ అయిపోయింది. అది నాకు చాలా హ్యాపీ. ప్రస్తుతం ఇద్దరం సినిమాలతో బిజీగా ఉన్నాం.