సాధారణంగా ఏడాదికి 365 రోజులు. కానీ ఈ ఏడాది 366 రోజులుంటాయి. ఎందుకంటే ఈ ఏడాది లీపు సంవత్సరం కనుక ఫిబ్రవరి నెలలో 29 రోజులు. నాలుగేళ్లకోసారి ఓ రోజు ఎందుకు ఎక్కువగా ఉంటుందా అని చిన్నప్పటినుంచీ చాలా మందికి దీనిపై ఆసక్తి నెలకొని ఉంటుంది. లీప్ ఇయర్ నెంబర్‌ను నాలుగోతో భాగిస్తే శేషం కచ్చితంగా సున్న (0) వస్తుంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దామా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: పుట్టింది ఫిబ్రవరి 29న.. మరి బర్త్ డేల సంగతేంటి?


భూమి తనచుట్టూ తాను తిరిగేందుకు 24 గంటల సమయం పడుతుంది. దీనినే మనం ఒకరోజుగా వ్యవహరిస్తాం. అదే విధంగా భూమి సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమించడం వల్లే పగలు, రాత్రులు ఏర్పడతాయని తెలిసిందే. అయితే ఒకసారి సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేయడానికి భూమికి భూమికి దాదాపుగా 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45 సెకన్లు పడుతుంది. ఈ అదనపు గంటల పావు రోజులు నాలుగు కలిపితే ఓరోజు అవుతుంది కదా.


See Pics: టాలీవుడ్ ఎంట్రీకి ముందే మోడల్ రచ్చ రచ్చ!  


పావురోజు అని సూచించడం కష్టం కనుక నాలుగేళ్లకోసారి ఫిబ్రవరి 29 వచ్చేలా గ్రెగోరియన్ క్యాలెండర్ రూపొందించారు. అందుకే లీపు ఇయర్‌లో మనకు 366 రోజులుంటాయి. అయితే ఎక్కువ రోజును తొలుత ఆగస్టులో జతచేశాడు రోమన్ చక్రవర్తి జూలియస్ క్యాసర్. ఆయన రాజ్యం బాధ్యతలు స్వీకరించే నాటికి 355 రోజులుండేవి. ప్రతి రెండేళ్లకు అదనపు 22 రోజులతో ఒక అదనపు నెల చేరేది. అయినా ఫిబ్రవరి 30 రోజులు, జులై 31రోజులు ఉంటే ఆగస్టుకు 29 రోజులు ఉండేలా క్యాసర్ నిర్ణయించారు.


Also Read: లీపు సంవత్సరంలో భారతీయులు దర్శించే ప్రాంతాలివే!


క్యాసర్ తర్వాత అధికారం చేపట్టిన క్యేసర్ ఆగస్టస్ తనకు నచ్చినట్లు క్యాలెండర్‌లో మార్పులు చేశాడు. తాను పుట్టిననెల ఆగస్టులో తక్కువ రోజులు ఉండటం ఇష్టంలేని కారణంగా.. ఆగస్టుకు 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులు చేసి పంతం నెగ్గించుకున్నాడు. ప్రతి ఏడాది అదనపు పావురోజు గంటలు నాలుగేళ్లకు ఓరోజుగా మారతాయి. ఆ రోజును ఫిబ్రవరిలో కలుపుతూ గ్రెగోరియన్ క్యాలెండర్‌లో మార్పులు చేశారు. అదనపు గంటలతో ప్రతి నాలుగేళ్లకు వచ్చే ఫిబ్రవరి 29ని క్యాసర్ అగస్టస్ గిఫ్ట్ టు ఫిబ్రవరిగా చెబుతుంటారు. దీంతో ప్రతి నాలుగేళ్లకు ఆ అదనపు రోజు కారణంగా లీపు సంవత్సరం వస్తుంటుంది. 2020 తర్వాత లీపు సంవత్సరం 2024లో వస్తుంది.


Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..