Love Today Day 1 Collections : అల్లరి నరేష్‌ను తొక్కి అవతల పారేసిన తమిళ డబ్బింగ్ సినిమా.. లవ్ టుడేకు దిమ్మ తిరిగే కలెక్షన్లు
Love Today Day 1 Collections కోలీవుడ్ సెన్సేషన్ లవ్ టుడే సినిమా తెలుగులోనూ దుమ్ములేపేసింది. తెలుగులో మొదటి రోజు లవ్ టుడ్ అదిరిపోయే కలెక్షన్లను రాబట్టేసింది. లవ్ టుడేలో సగం కూడా రాబట్టలేకపోయింది అల్లరి నరేష్ చిత్రం.
Itlu Maredumilli Prajaneekam Movie Collections : తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే పిచ్చి. అది ఏ భాష చిత్రమని కూడా చూడరు. సినిమా బాగుంటే చాలు. హీరో ఎవరన్నది కూడా పట్టించుకోరు. అలా సినిమాలను ప్రేమించే ప్రేక్షకులు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంటారు. కానీ కోలీవుడ్ జనాలు మాత్రం అలా కాదు. భాషాభిమానం అంటూ.. వేరే భాషల చిత్రాలను, హీరోలను అంతగా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు అసలే తమిళ వర్సెస్ తెలుగు సినిమా అన్నట్టుగా మారింది. వారిసు, వారసుడు సినిమాతో ఈ విబేధాలు మరింతగా ఎక్కువ అవుతున్నాయి.
అయితే ఈ వారం థియేటర్లోకి తోడేలు, లవ్ టుడ్ అనే డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో తమిళ డబ్బింగ్ చిత్రమైన లవ్ టుడేకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తీయగా.. కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఐదారు కోట్లతో సినిమా తీస్తే దాదాపు యాభై కోట్లకు పైగా రాబట్టేసింది. ఇప్పుడు తెలుగులోనూ ఈ చిత్రం మంచి ఆరంభంతో మొదలైంది.
లవ్ టుడే సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. లవ్ టుడే సాధించిన వసూళ్లలో కనీసం సగం కూడా రాబట్టలేకపోయింది ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం. లవ్ టుడేకు ఫస్ట్ డే నాడు 2.2కోట్ల గ్రాస్, 1.15 కోట్ల షేర్ వచ్చింది. అదే అల్లరి నరేష్ సినిమాకు అయితే 90 లక్షల గ్రాస్, 48 లక్షల షేర్ వచ్చింది. అంటే లవ్ టుడేలో మూడో వంతుని రాబట్టింది ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం. చూస్తుంటే ఈ వీకెండ్ మొత్తం లవ్ టుడే మేనియానే కనిపించేట్టుంది.
Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్
Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook