Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి

Jai Balayya Vs Boss Party జై బాలయ్య పాట, బాస్ పార్టీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాస్ పార్టీ వచ్చినప్పుడు తెగ ట్రోల్స్ జరిగాయి. అయితే జై బాలయ్య పాట మీద మరింత ఎక్కువగా ట్రోల్స్ జరగడంతో రెండింటినీ పోల్చేస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 03:01 PM IST
  • సోషల్ మీడియా బాస్ పార్ట సందడి
  • జై బాలయ్యపై దారుణమైన ట్రోల్స్
  • ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు
Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి

Jai Balayya Vs Boss Party సోషల్ మీడియాలో నందమూరి, మెగా అభిమానుల మధ్య జరిగే చర్చలు, వాగ్వాదాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అయితే చిరంజీవి, బాలయ్య సినిమాల మధ్య పోటీని తీవ్రంగా పరిగణిస్తున్నారు. సంక్రాంతి బరిలోకి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు కూడా మాస్ సినిమాలే. ఇద్దరూ కూడా మాస్ డైరెక్టర్లే. బాలయ్య సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో పవర్ ఫుల్‌గా ఉండబోతోంది.

చిరంజీవి వాల్తేరు వీరయ్య అయితే ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉండనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతికే ఈ రెండూ రావడం, ఒకే సంస్థ ఈ చిత్రాలను నిర్మించడం, ప్రమోషన్స్‌ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా మారనుంది. ఇప్పుడు అయితే ఈ రెండు సినిమాల నుంచి మొదటి పాటలు వచ్చాయి. ముందుగా వాల్తేరు వీరయ్య నుంచి పాట వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ రాసి, పాడిన బాస్ పార్టీ సాంగ్ మొదట్లో ఫుల్ ట్రోల్ అయింది. 

నిన్న బాలయ్య సినిమా వీరసింహారెడ్డి చిత్రం నుంచి జై బాలయ్య అనే పాట వచ్చింది. ఇందులో తమన్ మరీ దారుణంగా ఒసేయ్ రాములమ్మ పాట ట్యూన్‌ను కాపీ కొట్టేశాడు. దీంతో తమన్‌ను నెటిజన్లు దారుణంగా ఏకిపారేస్తున్నారు. అయితే అదేమీ మాస్ ట్యూన్ కూడా కాదు. దీంతో దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటే ఇప్పుడు ఎంతో నయంగా అనిపిస్తోంది. సోషల్ మీడియా కామెంట్లు, యూట్యూబ్ లెక్కలు కూడా అవే చెబుతున్నాయి.

బాస్ పార్టీ సాంగ్ 24 గంటల్లో 9.51 మిలియన్ల వ్యూస్, 250.6K లైక్స్ వచ్చాయి. అదే జై బాలయ్య పాట అయితే.. 7.00 మిలియన్ల వ్యూస్, 208K లైక్స్ వచ్చాయి. అంటే బాస్ పార్టీకే మంచి రెస్పాన్స్ వచ్చినట్టు. జై బాలయ్య పాటను జనాలు అంతగా పట్టించుకోనట్టుగా ఈ లెక్కలు చెబుతున్నాయి. ఈ మొదటి పరీక్షలో అయితే చిరు నెగ్గాడు.. అంటే దేవీ శ్రీ ప్రసాదే పై చేయి అయినట్టు.

Also Read : Jabardasth Satya : జబర్దస్త్‌కు తిరిగి వచ్చిన సత్య శ్రీ.. చమ్మక్ చంద్రతో విబేధాలే కారణమా?

Also Read : Jabardasth Varsha in Saree : వామ్మో వర్ష ఇలా వంగిపోయిందంటే?.. కిటికీల జాకెట్‌తో అందాల ప్రదర్శన

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x