#GhantaLeniVarasudu and #ThammudiGhantaPhalAAm Trending in Twitter: ఒకపక్క టాలీవుడ్ మేకర్స్ అంటే అటు హీరోలు కానీ దర్శకులు కానీ తెలుగు సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి ఎలా హిట్లు కొట్టాలని ఆలోచిస్తుంటే అలా ప్లాన్ ఇండియా లెవెల్ కి వెళ్లిన హీరోల అభిమానులు మాత్రం రాయడానికి కూడా ఇబ్బందికరమైన విధంగా ఒక హీరో మీద మరొక హీరో అభిమానులు ట్రోల్స్ చేయడం కలకలం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి అల్లు రామలింగయ్య కుటుంబంతో మెగాస్టార్ చిరంజీవి బంధుత్వం ఏర్పరచుకోవడంతో మెగా- అల్లు కుటుంబాలు రెండు ఒకటే అనే విధంగా కొనసాగుతూ వచ్చాయి. అయితే కొన్నేళ్ళ క్రితం అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ బేస్ పెరుగుతూ వెళ్లడంతో కాస్త రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ పాల్గొన్న ఒక ఈవెంట్ లో జై పవర్ స్టార్ అనమని పవన్ అభిమానులు పదేపదే తన ప్రసంగానికి అడ్డు వస్తూ ఉండడంతో అల్లు అర్జున్ సంయమనం కోల్పోయి చెప్పను బ్రదర్ అని కామెంట్ చేశారు.


ఆ తరువాత ఈ వివాదం చాలా దూరం వెళ్ళింది. అడపాదడపా సోషల్ మీడియాలో మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు మొదలైందో? ఎలా మొదలైందో? తెలియదు కానీ ఒకపక్క రామ్ చరణ్ అభిమానులు మరోపక్క అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. #GhantaLeniVarasudu, #ThammudiGhantaPhalAAm అనే పదాలతో ఎవరు ఊహించని విధంగా ట్రోల్ చేయడం కలకలం రేపుతోంది.


కనీసం దాన్ని వివరించి రాయలేని విధంగా కూడా ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఎంత దారుణంగా పరిస్థితి తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఒకపక్క రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం భారతదేశ వ్యాప్తంగా కాక విదేశాలలో కూడా పలు భాషలలో డబ్బింగ్ అయ్యి ఈ సినిమా విడుదలవుతోంది.


అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ప్రజలనే కాకుండా నార్త్ లో సైతం మంచి బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. ఇలా హీరోలు కష్టపడి వేరే స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే వారి అభిమానులు మాత్రం ఇంకా తమకు ఇష్టం లేని హీరోలను ట్రోల్ చేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ ఇతర భాషల ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ చూస్తే టాలీవుడ్ చులకనవ్వడం తప్ప మరోటి లేదనే చెప్పాలి. 


Also Read: Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. షూట్ అప్పుడే అంటూ!


Also Read: Urvashi Rautela Pics: పొట్టి డ్రెస్‌లో ఊర్వశి రౌతేలా.. ఎద, తొడ అందాలు ఫోకస్ చేస్తూ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి