చాలా గ్యాప్ తర్వాత బన్నీ వరస మూవీ షెడ్యూల్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్న అల్లు అర్జున్...ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సుకుమార్ తో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ 20వ సినిమాగా తెరకెక్కనున్నఈ సినిమా వచ్చే నెలలో గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే సుకుమార్ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ సినిమా చేయనున్న బన్నీ... ఈ సినిమాతో పాటు మురుగదాస్ తో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ రెండు సినిమాలను ఒకే సమయంలో చేసే సెట్స్ పైకి చాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మురుగదాస్ ప్రస్తుతం రజినీకాంత్ తో ‘దర్బార్’ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మురుగదాస్ సినిమా అల్లు అర్జున్ తోనే ఉండబోతుంది. ఇప్పటికే స్టైలిష్ స్టార్ కి ఓ పాయింట్ చెప్పిన మురుగదాస్ ‘దర్బార్’ రిలీజ్ తర్వాత బన్నీ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చుంటాడని సమాచారం.