మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన అమర్ అక్బర్ ఆంటోని మూవీ ట్రైలర్ విడుదలైంది. అమర్ అక్బర్ ఆంటోని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మాస్ మహారాజ రవితేజ, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ శ్రీను వైట్ల తనదైన కామెడిని పండించాడని అమర్ అక్బర్ ఆంటోని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. శ్రీను వైట్ల మార్క్‌తో విడుదలైన అమర్ అక్బర్ ఆంటోని ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..