కొత్త సంవత్సరాన్ని సెలబ్రిటీలు, సామాన్యులు అనే వ్యత‍్యాసం లేకుండా ఎవరికి తోచినట్లుగా వారు జరుపుకున్నారు. నటి, స్టార్‌ యాంకర్‌ అనసూయ న్యూ ఇయర్‌ సందర్భంగా అడవిలో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేసుకోవడం కాస్త కొత్తగా అనిపించి ఉండవచ్చు. కొందరు సెలబ్రిటీలు ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు, మరికొందరు విదేశాలలో తమ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. అనసూయకు ప్రకృతిపై ఎంత ప్రేమ ఉందోనంటూ కొందరు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా అనసూయ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాను కదిలిస్తోంది. ‘భగవంతుడా మమ్మల్ని కాపాడు‘ అని క్యాప్షన్‌తో ఓ వీడియో ట్వీట్‌ను అనసూయ రీట్వీట్‌ చేసింది. అందుకు చాలా పెద్ద కారణం ఉంది. ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా కొనసాగుతోన్న కార్చిచ్చు ప్రకృతి విలయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. ’ఆస్ట్రేలియా మంటల్లో చిక్కుకుంది. 50కోట్లకు పైగా మూగజీవాలు చనిపోయాయి. 1.45కోట్ల ఎకరాల అటవీ ప్రాంతం బూడిదైపోయింది. వాతావరణ మార్పు ఇది‘ అని ఎర్త్‌ సంస్థ ఆస్ట్రేలియా కార్చిచ్చు వీడియోను ట్వీట్‌ చేసింది.

యాంకర్‌ అనసూయ ఈ వీడియో చూసి చలించిపోయింది. భగవంతుడా మమ్మల్ని కాపాడమని కోరుతూ ఆ వీడియోను రీట్వీట్‌ చేసింది. కోట్ల ఏకరాల అటవీ ప్రాంతంతో పాటు, కోట్లాది పక్షులు, క్షీరదాలు, ఇతర జంతువులు మంటల్లో కాలి బూడిదైపోవడంపై పర్యావరణ, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో సైతం న్యూ సౌత్‌వేల్స్‌, క్వీన్స్‌లాండ్‌లో  కార్చిచ్చు భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం విదితమే.