Anchor Vishnupriya : దేవుడా.. నాకు ఎప్పుడు ఇలా ముద్దులు పెట్టుకునే చాన్స్ ఇస్తావ్!.. ఉడికిపోతోన్న విష్ణుప్రియ
Alia Bhatt Kiss to Ranbir Kapoor యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అయితే విష్ణుప్రియ తాజాగా బాలీవుడ్ జంటను చూసి తనలోని కోరికలను బయటపెట్టేసింది. అలియా భట్, రణ్ బీర్ కపూర్‌లకు పెళ్లై ఏడాది అయింది. ఈ సందర్బంగా వీరు పార్టీ చేసుకున్నట్టున్నారు.బయటకు వచ్చిన ఈ జంటను చూసి.. అందరూ కంగ్రాట్స్ చెప్పారు. ఈ క్రమంలో రణ్ బీర్ కారులోంచే అందరికీ కరచాలనం చేస్తూ ఉన్నాడు. మధ్యలో రణ్ బీర్ కపూర్‌ను ప్రేమగా ముద్దు పెట్టుకుంది అలియా భట్.
అలియా పెట్టిన ముద్దు మీద విష్ణుప్రియ స్పందించింది. దేవుడా ఇలా ముద్దు పెట్టుకునే చాన్స్ నాకు ఎప్పుడు ఇస్తావ్? అంటూ విష్ణుప్రియ అడిగేసింది. విష్ణుప్రియ ఆ మధ్య అయితే తన పెళ్లి గురించి ఎక్కువగా కామెంట్లు చేసింది. తన భర్త ఎక్కడ ఉన్నాడో.. ఎలా ఉన్నాడో అంటూ తన మీద తానే సెటైర్లు వేసుకుంటూ ఉండేది. ఇక అఖిల్ అక్కినేని అంటే మాత్రం తనకు ప్రాణం, పిచ్చి, ప్రేమ అంటూ విష్ణు ప్రియ ఊగిపోతుంటుంది.
[[{"fid":"269511","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
విష్ణుప్రియ ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లతో క్రేజ్ దక్కించుకుంటోంది. మానస్, విష్ణుప్రియలు కలిసి చేస్తోన్న ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోన్నాయి. ఆ పాటలను సైతం పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ జరీకట్టు అనే పాట హిట్ అయింది. ఇప్పుడు గంగులు అనేది ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Also Read: Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్
విష్ణుప్రియ ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. సినిమాలు కూడా చేయడం లేదు. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలు, పండుగ ఈవెంట్లలో కనిపిస్తోంది. ఈషా ఫౌండేషన్ కార్యక్రమాల్లో నిత్యం కనిపిస్తుంటుంది. ఇక రీతూ చౌదరితో కలిసి విష్ణుప్రియ ఎక్కువగా వెకేషన్లకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ అందాల ఆరబోతలో రెచ్చిపోతోన్నారు.
Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook