NTR Fan: అన్న ఎన్టీఆర్ గారి వీరాభిమాని అయిన NTR రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ బతుకున్న రోజుల్లో ఈయన లేనిదే కుటుంబానికి సంబంధించిన ఏ వేడుక నిర్వహించే వారు కాదు అన్నగారు. అలా వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఒకడిగా ఉన్నారు. ఒకవైపు నందమూరి కుటుంబంతో పాటు నారా కుటుంబానికి కూడా ఈయన వీర వీధేయులు. గతంలో అన్నగారు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆఫర్ చేసినా.. సున్నితంగా తిరస్కరించిన మహోన్నత వ్యక్తిత్త్వం ఈయన సొంతం. ఎన్నిసార్లు ఎన్టీఆర్..రాజు గారిని ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినా.. మీకు భక్తుడిగా ఉంటానని చెప్పిన నిరాడంబర వ్యక్తి NTR రాజు. దీంతో అన్నగారు అప్పట్లో ఈయన్ని తిరుమల తిరుపతి దేస్థానం బోర్డ్ మెంబర్‌గా నియమించారు. ఆ తర్వాత కూడా మరోసారి ఈయన టీటీడీ బోర్డ్ మెంబర్‌గా పనిచేసారు. టీటీడీ బోర్డ్ సభ్యుడిగా ఉంటూ ఎలాంటి వేతనం కూడా తీసుకోకుండా.. దేవుడి సేవలో భాగంగా ఆ పనిని ఎంతో చిత్తశుద్దితో నిర్వర్తించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నిన్న నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి నారా భువనేశ్వరి తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రిగారి అభిమానిగా ఉన్న NTR రాజు చేసిన సేవలను లోకేష్‌, బ్రహ్మణిలకు వివరించారు. మరోవైపు నారా లోకేష్, బ్రహ్మాణిలతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుట్టినరోజు జరుపుకుంటున్న నారా దేవాన్ష్‌కు NTR రాజు శుభాశీస్సులు అందించారు. NTR రాజు నందమూరి, నారా కుటుంబ సభ్యుల పుట్టినరోజులతో పాటు ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజున దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం.. అన్నదానం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ కుటుంబంపై ఈయన అభిమానం వారసత్వంగా ఆయన అబ్బాయిలకు సంక్రమించింది. వాళ్ల అబ్బాయి కూడా తెలుగు యువత జిల్లా ప్రెసిడెంట్‌గా పనిచేసారు.  ఎన్టీఆర్ గారు మొదటగా  తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే కూడా చేయలేదు. గతంలో కూడా మొన్న ఆయన చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు గానీ అలాగే హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నప్పుడు  పూజలు చేయడం జరిగింది. ఈయన పేరు రాజు అయిన ఎన్టీఆర్ పై అభిమానంతో NTR రాజుగా అన్నగారి అభిమానులు పిలవడం జరగుతోంది.


Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌


Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్‌ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter