ఇంతకాలం తన లవర్ పేరును సస్పెన్స్‌లో ఉంచుతూ వచ్చిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఎట్టకేలకు బయటపేట్టేసింది. టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడ్డానని ఈ ముద్దుగుమ్మ  బాంబు పేల్చింది.  ఓ టాలీవుడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనుష్క ఈ విషయాన్ని బయటపెట్టింది. మీ అభిమాన క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు అనుష్క జవాబిస్తూ...  తన అభిమాన క్రికెటర్ ‘రాహుల్‌ ద్రవిడ్‌ అని...చిన్నప్పటి నుంచి రాహుల్ అంటే తనకు పిచ్చి అని.. ఎంతగా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్ తో ప్రేమలో పడ్డానని వెల్లడించింది ‌. 


ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ అండర్-19, భారత్‌-ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. బాహుబలి సినమాలో నటించి టాప్ పొజిషన్‌కు చేరిన అనుష్క శెట్టి.. ప్రస్తుతం ‘భాగమతి' సినిమాలో నటిస్తోంది. కాగా ఇటీవలికాలంలో క్రికెటర్లు, సినిమా రంగానికి చెందిన వారిని ప్రేమించడం...వారితో ప్రేమలో పడటం అనేది కామన్ అయిపోయింది.. అనుష్క లవ్ స్టోరీలో వింత ఏమిటంటే..రాహుల్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనుష్క ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.