అరవింద సమేత సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్
అరవింద సమేత సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమా అరవింద సమేత నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న అరవింద సమేత దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన అరవింద సమేత సినిమా ఆడియో రిలీజ్ కానుండగా అంతకన్నా ముందుగా ప్రకటించినట్టుగానే ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమా నుంచి అనగనగా అనే ఫస్ట్ సింగిల్ ట్రాక్ రిలీజ్ చేశారు. నిడివి కలిగిన ఈ పాటను సరిగమ లిటిల్ చాంప్స్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచిన అర్మాన్ మాలిక్ పాడాడు. అర్మాన్ మాలిక్ తొలిసారిగా తెలుగులో పాడిన పాట ఇదే. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అనగనగా పాటపై మీరూ ఓ లుక్కేసేయండి.