ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: అరవింద సమేత ఫస్ట్ సాంగ్ `అనగనగా` విడుదలకు ముహూర్తం ఖరారు
అరవింద సమేత ఫస్ట్ సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్ ఇది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా ఆడియో రిలీజ్ కానుండగా అంతకన్నా ముందుగా ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమా నుంచి అనగనగనగా అనే ఫస్ట్ సింగిల్ ట్రాక్ రిలీజ్ కానుంది. సరిగమ లిటిల్ చాంప్స్ లో ఫైనలిస్ట్ గా నిలిచిన అర్మాన్ మాలిక్ పాడిన పాట ఇది. తాను తొలిసారిగా తెలుగులో పాడిన పాట ఇవాళ సాయంత్రం విడుదల కానుందంటూ అర్మాన్ మాలిక్ ట్విటర్ ద్వారా ఆనందం వ్యక్తంచేశాడు. అనగనగా పాట వినాలంటే ఇవాళ సాయంత్రం 4:05 గంటల వరకు వేచిచూడాల్సిందే.