Kalingaraju: ‘కళింగరాజు’ ఫస్ట్ లుక్ విడుదల.. అదిరిపోయిన పోస్టర్
Kalingaraju First Look Poster: కళింగరాజు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆశిష్ గాంధీ హీరోగా యాక్ట్ చేస్తుండగా.. కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల నిర్మిస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
Kalingaraju First Look Poster: నాటకం సినిమాతో హీరోగా ఆశిష్ గాంధీ, దర్శకుడిగా కళ్యాణ్‌జీ గోగణకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్‌ను చేయడం విశేషం. ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబోలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ స్పెక్ట్రమ్ స్టూడియోస్, సుందరకాండ మోషన్ పిక్చర్స్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘కళింగరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కళ్యాణ్‌జీ గోగణ, ఆశిష్ గాంధీ కాంబోలో వస్తున్న ‘కళింగరాజు’ చిత్రాన్ని రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘కళింగరాజు’ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను బుధవారం లాంచ్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఊరి వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆశిష్ గాంధీ కుర్చీ మీద కూర్చున్న తీరు, రక్తంతో తడిచిన ఆ కత్తి, రక్తపు మరకలతో కూడిన ఆ పాల క్యాన్ ఇదంతా చూస్తుంటే సినిమా అంతా రా అండ్ రస్టిక్‌గా ఉండేలా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. 90s వెబ్ సిరీస్‌తో సురేష్ బొబ్బిలి ఈ మధ్య ఎంతగా ట్రెండ్ అయ్యారో అందరికీ తెలిసిందే. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కెమెరామెన్, దర్శకుడిగానూ సత్తా చాటుతున్న గరుడవేగ అంజి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. రాకేందు మౌళి పాటలు రచించారు.
సాంకేతిక బృందం
==> బ్యానర్లు : రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ స్పెక్ట్రమ్ స్టూడియోస్, సుందరకాండ మోషన్ పిక్చర్స్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్
==> నిర్మాత: రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల
==> కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌జీ గోగణ
==> సంగీతం: సురేష్ బొబ్బిలి
==> కెమెరామెన్: గరుడవేగ అంజి
==> ఎడిటర్: చోటా కే ప్రసాద్
==> PRO: సాయి సతీష్
Also Read: IPL 2024 Updates: కప్ కొట్టాలనే కసితో ఆర్‌సీబీ.. కొత్త స్క్వాడ్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter