నగావ్: కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను (Lockdown) రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తోంటే.. ఆ లాక్‌డౌన్‌ని జనం అంతే కఠినంగా పాటించేందుకు కృషి చేస్తోన్న పోలీసులు రేయింబవళ్లు విధుల్లోనే గడిపేస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా అలుపుసొలుపు లేకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.. ఆ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు తమకు తోచిన మార్గం ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే అస్సాంలోని నగావ్ జిల్లా పోలీసులు కూడా వారి రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యమైన బిహు డ్యాన్స్‌తో (Bihu dance) ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. Also read : Telangana: లాక్‌డౌన్ తీవ్రతరం.. రేపటి నుంచి కఠినమైన ఆంక్షలు



నగావ్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు రాత్రి 9.30 గంటలకు 2 నిమిషాల పాటు చిన్న బ్రేక్ తీసుకుని బిహు డ్యాన్స్ (Bihu folk dance) చేసి రిలాక్స్ అయ్యారు. అస్సాం పోలీసుల బిహూ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..