COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Atharva Movie: డైరెక్టర్ మహేష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ  'అథర్వ'..ఈ సినిమా క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా రాబోతోంది. ఈ మూవీ పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ రూపొందుతోంది. అథర్వలో  హీరోహీరోయిన్లుగా  కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా విజయ, ఝాన్సీ వ్యవహరించగా, ఈ డిసెంబర్‌ 1వ తేదిన అన్ని థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా దర్శకుడు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే మీడియాతో ఏం చర్చించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 



‘అథర్వ’ కథను ఎక్కుడి నుంచి తీసుకున్నారు?:
ఇంతక ముందు క్లూస్ టీం హెడ్‌గా పని చేసిన హెడ్ వెంకన్న ఇంటర్వ్యూని ఇటీవలే చూశాను. ఎదైనా ఒక క్రైమ్‌ జరిగినప్పుడు ముందుగా క్లూస్‌ టీం వచ్చి అధికారింగా కొన్ని పనులు చేస్తారు. వారు క్రైమ్‌ టీమ్‌లో ఏం సేకరించారో ఆ వస్తువులనే కోర్టులో సాక్ష్యాలుగా సమర్పిస్తారు. ప్రపంచంలో జరిగే ప్రతి క్రైమ్‌ కేసును 70 నుంచి 80 శాతం వరకు క్లూస్ టీం మాత్రమే పరిష్కరిస్తుంది. అయితే ఇలాంటి క్లూస్‌ టీం గురించి ఇంత వరకు మూవీస్‌ తీయలేరు. ఈ టీం గురించి చెప్పాలని కథను రాసుకున్నాను.


ఎలాంటి సీన్లు ఎక్కువగా ఉంటాయి?:
అథర్వ మూవీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతోంది. కాబట్టి మర్డర్, రాబరీ సీన్లతో సినిమా ఉండబోతోంది. ఈ మూవీ చాలా వరకు రియలిస్టిక్‌గా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని యాదార్థ సంఘటలను కూడా ఇందులో కవర్‌ చేశాము. దీంతో ఈ సినిమాలో కొన్ని ఫిక్షన్ కూడా యాడ్ చేసాను. 


హీరోగా కార్తీక్ రాజు ఎలా పని చేశారు?:
ఈ సినిమాకు నేనే మాత్రమే కొత్తవాడిని, అందరికీ మూవీస్‌లో మంచి అనుభం ఉంది. కార్తీక్‌ ఇంతక ముందు చాలా సినిమాలు చేశాడు. అంతేకాకుండా సీనియర్‌ ఆర్టిస్టులుగా చాలా చిత్రాల్లో పని చేశారు. ఈ సినిమాకు ఆయన అనుభవం చాలా కలిసి వస్తుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


ఈ సినిమాలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి?:
అథర్వ మూవీని మీరు తప్పకుండా చూడాలి..ఎందుకంటే ఈ చిత్రంలో విరామం తర్వాత ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్‌ ఉంటుంది. అస్సలు మీరు ఈ సినిమా క్లైమాక్స్‌, ప్రీ క్లైమాక్స్ ఊహించరు. 


‘హవా’ ఎందుకు ఇంత లేట్ అయింది? 
‘హవా’ మూవీని అసలు ప్లాన్‌ చేయలేదు. కానీ నేను, చైతన్య రావు ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేయాలని ఇండస్ట్రీలో రావడానికి కార్డ్‌లా ఉండాలని, ఓ ప్రయోగం చేశాం..అదే హవా మూవీ..లాస్ట్‌లో అదే చిత్రంగా మారింది. ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించాలని ఇంత గ్యాప్‌ తీసుకున్నా..


హీరోయిన్ల పాత్ర ఎలా ఉంటాయి:
అథర్వ చిత్రంలో క్లూస్ టీంలో హీరోగా పని చేస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ క్రైమ్ రిపోర్టర్‌గా పని చేస్తారు. ఈ కథలో రెండు ప్రాత్రలుంటాయి. చిత్రంలో కథలకు తగ్గట్లే నటించారు. 


అనుకున్న బడ్జెట్‌లోనే తెరకెక్కించారా? 
ప్రోడ్యుషర్స్‌ ముందుగా ఈ స్టోరీని విన్నప్పుడు టీం గురించి కానీ హీరో హీరోయిన్ల గురించి చెప్పలేదు. వారికి ఈ కథ మాత్రం నచ్చింది. దీంతో వారు ఎంత ఖర్చైనా నినిమా చేద్దామని ముందుకు వచ్చారు. చిత్రం బాగా రావాలని ఎక్కడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. 


సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఏంటి?:
ప్రస్తుతం ఫుల్‌ ఫాంలో ఉన్న శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు RR అద్భుతంగా ఇచ్చారు. పోలీస్‌ సైరన్‌ నుంచి కూడా మంచి మ్యూజిక్‌ను అందించారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని మంచి మాస్, రొమాంటిక్, ఫోక్ సాంగ్స్‌ కూడా ఇచ్చారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి