ప్రముఖ టాలీవూడ్ నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష ఖారారైంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు కేసు తీర్పు వెల్లడించింది. బండ్ల గణేష్ కు ఆర్నెల్ల జైలుశిక్ష తో పాటు 15.86 లక్షలు జరిమానా విధించింది. 'టెంపర్' సినిమాకు చెల్లని చెక్కులు ఇచ్చారని రచయిత వాసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం కేసు తీర్పు వెల్లడించింది.


బండ్ల గణేష్ మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ టాలీవూడ్ లో సినీ కెరీర్ ను ప్రారంభించాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసాడు. 'ఆంజనేయులు' సినిమా ద్వారా నిర్మాతగా మారాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్  స్థాపించి 'ఇద్దరమ్మాయిలతో', 'గబ్బర్ సింగ్', 'బాద్షా', 'టెంపర్'  వంటి చిత్రాలు నిర్మించాడు.