Hero Srikanth Divorce : సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వార్తలు వైరల్ అవుతుంటాయో.. అలాంటి వార్తలు ఎలా పుడుతాయో.. ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో.. ఎవరు పుట్టిస్తారో కూడా తెలియదు. అయితే కొన్ని రోజుల నుంచి హీరో శ్రీకాంత్, ఊహల మీద రకరకాల పిచ్చి రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరూ విడిపోయారని, విడి విడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతోన్నారంటూ రూమర్లు వచ్చాయి. అయితే దీనిపై హీరో శ్రీకాంత్ మండిపడ్డట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



తాజాగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ వేశాడు. దాంతో విడాకుల రూమర్లకు పుల్ స్టాప్ పడ్డట్టు అయింది. బండ్ల గణేష్ షేర్ చేసిన ఈ ఫోటోలో శ్రీకాంత్, ఊహ కనిపించారు. ఈ ఇద్దరూ కూడా అరుణాచలం దేవాలయానికి వెళ్తున్నారని చెప్పుకొచ్చాడు. తాను వారితో వీడియో కాల్ మాట్లాడినట్టుగా స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. అలా ఈ విడాకుల రూమర్లకు తన స్టైల్లో పుల్ స్టాప్ పెట్టేసినట్టు కనిపిస్తోంది. అందుకే బండ్ల గణేష్‌ ఇలా ట్వీట్ వేసినట్టు తెలుస్తోంది.


అసలే హీరో శ్రీకాంత్ ఫుల్ ఫ్యామిలీ పర్సన్‌లా ఉంటాడు. ఎప్పుడూ వివాదాలను అంటించుకోడు. తన జీవితం ఏదో తాను అన్నట్టుగా సైలెంట్‌గా ఉంటాడు. అలాంటి శ్రీకాంత్ మీద ఇలాంటి పిచ్చి రూమర్లు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి పనికిమాలిన, నిరాధారమైన వార్తలను ఎవరు పుట్టిస్తున్నారు అంటూ శ్రీకాంత్ ఫైర్ అయ్యాడట. గతంలోనూ తాను చనిపోయినట్టుగా పుకారు పుట్టించారని, తన వారిని ఆందోళనకు గురి చేసినట్టుగా శ్రీకాంత్ ఈ రూమర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.


తాము ఆర్థిక ఇబ్బందుల కారణంగా  విడాకులు తీసుకుంటున్నామంటూ ఓ న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు శ్రీకాంత్. కొన్ని వెబ్‌సైట్స్‌లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్‌లను ఊహ వద్దకు చేరడంతో కంగారుపడి తనకు చూపించిందని.. ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు ...ఆందోళన పడవద్దు అని తనను ఓదార్చానంటూ అసలు విషయాలను శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.


బంధుమిత్రులందరూ ఫోన్ చేసి  అడుగుతుంటే వివరణ  ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుందని తన బాధనంతా వెల్లగక్కాడు . ప్రస్తుతం తానూ, ఊహ నిన్న చెన్నై వచ్చి అక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నామని తెలిపాడు. ఇలాంటి సమయంలో ఈ పుకారు తమ కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుందని ఆందోళన చెందాడు. 


ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం  ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నానంటూ శ్రీకాంత్ అసలు విషయాన్ని చెప్పేశాడు. తన మీదనే కాకుండా  చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్‌ను శ్రీకాంత్ కోరాడు.


Also Read : Boss Party Song Promo : వాల్తేరు వీరయ్య.. ఇదేం పాట అయ్యా.. దేవీ శ్రీ ప్రసాద్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు


Also Read : Jr NTR New Look : ఎన్టీఆర్ స్టైలీష్ లుక్.. నాటి రోజులు గుర్తొచ్చేలా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook