Bandla Ganesh Tweets on KCR: ఎప్పటికప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ హాట్ టాపిక్ గా ఉండే బండ్ల గణేష్ ఇప్పుడు మాత్రం తెలంగాణ సీఎం  కేసీఆర్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఎన్నో రోజుల నుంచి శ్రీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.. ఆ స్వామి వారి అనుగ్రహం లేక నాకు రావడం కుదరలేదు, కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి, ఆ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అయిన కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్న బండ్ల ⁦ తెలంగాణ అద్భుతమైన ప్రగతి పథం వైపు దూసుకు పోతుంది అని చెప్పడానికి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఓ నిదర్శనం..⁦శ్రీ కేసీఆర్ గారి ఆలోచన, ఆచరణ ఇవే కాకుండా వాటిని నిర్మిస్తున్న ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానం గానీ మహా అద్భుతంగా తృప్తి చెందాను, ⁦ చాలా సంతోషం అనిపించిందని అన్నారు.


ముఖ్యమంత్రి గారు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నాను, మీరు ఈ రాష్ట్రానికే కాదు దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి పథం వైపు నడిపించే సత్తా, సామర్థ్యం మీకు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నానని అన్నారు.  ఈ యాదగిరి నరసింహస్వామి ఆలయం చూశాక, మీ మదిలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మీ మదిలో వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరణలో పెట్టి ప్రజలకు అందించాలన్న మీ సంకల్పం చాలా గొప్పదని బండ్ల అన్నారు.


ఇక ఆనందంగా, చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికే గాక భారతదేశం మొత్తానికి మీ అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్న బండ్ల ఈరోజు భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన మన తెలంగాణను నంబర్ వన్  రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మీ ఆలోచన విధానం, మీ కఠోర తపస్సు, మీ ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడిందని అది తనకు ఆనందాన్నిస్తుందని అన్నారు. ఇక ⁦ నరసింహస్వామిని చూసిన తర్వాత ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు మీపై ఉండాలని, ఎల్లవేళలా ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఉండాలని, మా ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.


ఇక ఏ స్వార్ధం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు, నా మనసులోని మాటలు చెప్తున్నానని పేర్కొన్న ఆయన మంచి చేస్తే మంచి అని చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను, అది నా నైజం సార్, మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా లవ్ యు కేసీఆర్ గారు అంటూ ఆయన వరుస ట్వీట్లు చేస్తూ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు అని చెప్పక తప్పదు. 
Also Read: Hero Nani Clarity: నాని నోట బూతు పదం.. అసలు సంబంధమే లేదంటున్నాడే!


Also Read: Venkatesh Warning: నెట్ ఫ్లిక్స్ కు వెంకీ మామ వార్నింగ్.. నా పేరే పెట్టాలంటూ వీడియో రిలీజ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook