న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు మరింత విజృంభిస్తున్నారు. ఉచితంగా కరోనా టెస్టులు చేస్తామంటూ మెయిల్స్ వస్తే క్లిక్ చేయవద్దని ఖాతాదారులకు SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) హెచ్చరికలు జారీ చేసింది. కరోనా టెస్టుల పేరిట సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ అటాక్ చేసే అవకాశముందని, NCOV2019@GOV.IN మెయిల్ ఐడి లేదా ఇతర ఇమెయిల్స్ నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని ఎస్‌బిఐ ఖాతాదారులకు సూచించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ ఖాతాదారులకు బ్యాంక్ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని SBI హెచ్చరించింది. రూ.50 వేల మార్క్ దాటి బంగారం పరుగులు


 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ