Bigg Boss 6 Telugu 3rd Week Nominations Leaked: ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇప్పటికే రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి వారంలో ఎలాంటి ఎలిమినేషన్ జరగలేదు కానీ రెండో వారంలో ఇద్దరినీ బిగ్ బాస్ ఎలిమినేట్ చేశారు. దీంతో 21 మంది హౌస్ సభ్యులు ఇప్పుడు 19 మంది అయ్యారు. ఇక ఈ వారం 19 మందిలో తొమ్మిది మంది ఎలిమినేషన్స్ కోసం నామినేట్ అయినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా సోమవారం రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్లో ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే విషయం తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న విషయాలన్నీ ముందే లీక్ అవుతున్న నేపథ్యంలో ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే విషయం కూడా ముందే లీక్ అయింది. వాస్తవానికి నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ షోలో చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మామూలు రోజుల్లో కలిసి కనిపించే కంటెస్టెంట్లు కూడా ఈ నామినేషన్ సమయంలో అగ్రిసివ్గా ఒకరి మీద ఒకరు పోరాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.


మొదటి వారంలో ఎలాంటి ఎలిమినేషన్కు చోటు ఇవ్వని బిగ్ బాస్ రెండో వారంలో ఇద్దరిని బయటకు పంపేశాడు. ఇక సోమవారం నాడు ప్రసారం అవ్వబోతున్న ఎపిసోడ్లో మొఖానికి ఎర్ర రంగు పూసే నామినేట్ చేసే టాస్క్ జరిగినట్లు తెలుస్తోంది ఇక ఈ వారం నామినేషన్ లో ఏకంగా తొమ్మిది మంది నామినేట్ అయినట్లుగా లీక్స్ బట్టి తెలుస్తోంది. అలా నామినేట్ అయిన వారు ఎవరెవరు అంటే గీతూ, సింగర్ రేవంత్, బాలాదిత్య, చలాకి చంటి, ఆరోహి రావు, నేహా చౌదరి, శ్రీహాన్, ఇనయ సుల్తానా, వాసంతి కృష్ణన్ ఈ వారం ఎలిమినేషన్స్ కోసం నామినేట్ అయ్యారు.


Also Read:  God Father Release: సల్మాన్ ఖాన్ దెబ్బకు దిగొచ్చిన గాడ్ ఫాదర్ టీం..అంతా సెట్!


Also Read: Jr NTR sings Kiss Me: కొమురం భీముడితోనే కామెడీలా.. మరీ ఇలా ఉన్నారేంట్రా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి