Jr NTR sings Kiss Me: కొమురం భీముడితోనే కామెడీలా.. మరీ ఇలా ఉన్నారేంట్రా

Jr NTR sings Kiss Me Song in RRR Komuram Bheemudo style: డైలీ మిల్క్ యాడ్ కోసం కిస్ మీ అనే వీడియో చాలాసార్లు చూసే ఉంటాం. ఆ ఆడియోతో కొమరం భీముడో సాంగ్ వీడియో సింక్ చేసి ఫ్యాన్స్ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 18, 2022, 06:39 PM IST
Jr NTR sings Kiss Me: కొమురం భీముడితోనే కామెడీలా.. మరీ ఇలా ఉన్నారేంట్రా

Jr NTR sings Kiss Me Song in RRR Komuram Bheemudo style: రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది మార్చి 25వ తేదీన విడుదల సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాడే కొమరం భీముడో సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ వీడియోకి మరో ఆడియోతో కలిపిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా డైలీ మిల్క్ యాడ్ కోసం కిస్ మీ అనే వీడియో చాలాసార్లు చూసే ఉంటాం. ఆ ఆడియోతో కొమరం భీముడో సాంగ్ వీడియో సింక్ చేసి ఫ్యాన్స్ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ప్రేక్షకుల నుంచి భిన్న స్పందన తెచ్చుకుంటుంది ఈ సాంగ్. క్యాడ్బరీ డైరీ మిల్క్ బ్రాపర్ ఎన్టీఆర్ మొఖాన పడడంతో ఈ వీడియో మొదలవుతుంది. ‘’అది ఎంటర్టైన్మెంట్’’ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. నిజానికి ఈ వీడియో జూలై నెలలోనే రూపొందించబడినట్లు తెలుస్తున్నా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మాత్రం ఆసక్తికరంగా మారింది. 
Also Read: Krithi Shetty Disasters: మూడు హిట్లు-మూడు డిజాస్టర్లు.. కృతికి బాడ్ టైం స్టార్ట్స్!

Also Read: Jaya kumari: నాటి మేటి నటి జయకుమారి, చికిత్సకు డబ్బుల్లేక దీనావస్థలో, దాతలు కోసం ఎదురుచూపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News