సల్మాన్ అభ్యర్ధనపై విచారణ జులై17కి వాయిదా
ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వచ్చిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోమవారం జోధ్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు.
జోధ్‌పూర్: ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వచ్చిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోమవారం జోధ్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. తనకు విధించిన ఐదేళ్ల శిక్షను ఎత్తివేయాల్సిందిగా దాఖలు చేసుకున్న పిటిషన్‌ను స్వీకరించిన జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు విచారణను జులై 17కు వాయిదా వేసింది.
1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్‌ఖాన్‌కు ఏప్రిల్ 5న జోధ్‌పూర్ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండు రోజులు జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో గడిపిన సల్మాన్ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత సల్మాన్ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం చిత్రీకరణ నిమిత్తం విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.