బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (Irrfan Khan Passes Away) చనిపోయారు. ఇర్ఫాన్ పరిస్థితి సీరియస్ కావడంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్‌లో మంగళవారం చేర్పించారు.
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చనిపోయారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమవుతున్న ఇర్ఫాన్ పరిస్థితి సీరియస్ కావడంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్‌లో మంగళవారం చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వారం రోజుల వ్యవధిలో ఇర్ఫాన్ ఖాన్ ఇంట్లో ఇది రెండో విషాదం కావడం గమనార్హం. ఏపీలో తాజాగా 73 మందికి కరోనా.. 3 జిల్లాల్లో అలర్ట్
అరుదైన వ్యాధితో పోరాడిన ఇర్ఫాన్ ఖాన్ కోలుకోలేకపోయారు. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ సమస్యకు లండన్ వెళ్లి చికిత్స తీసుకున్నారు. కొద్దికాలం కిందట భారత్‌కు తిరిగొచ్చి సినిమా షూటింగ్స్ పూర్తి చేశారు. పూర్తి స్థాయిలో వ్యాధిని నయం చేసుకోవడానికి మరోసారి లండన్ వెళ్లాలని భావించారు. కానీ విధి మరోలా మంది. అంతలోనే ఆనారోగ్యం మళ్లీ తిరగబెట్టడంతో కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయింది.. అబ్బాయిలూ జాగ్రత్త: నటి శ్రీరెడ్డి
తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సైనికుడు సినిమాలో విలన్ పాత్ర పోషించడం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. పలు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఇర్ఫాన్ ఖాన్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!
గతవారం నటుడు ఇర్ఫాన్ తల్లి సయేదా బేగం (95) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సయేదా బేగం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. జైపూర్‌లోని బెనివాల్ కాంట కృష్ణ కాలనీలో ఆమె నివాసం ఉండేవారు. అసలే ఆరోగ్యం బాగోలేని ఇర్ఫాన్ తల్లి మరణంతో మరింత కుంగిపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!