ముంబై: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబైలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది మంది వలస కార్మికులకు బస్సుల్లో తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి నటుడు సోనుసూద్ సహాయ సహకారాలు కల్పించారు. వలస కార్మికులకు సోమవారం థానే స్టేషన్ నుండి రెండు ప్రత్యేక రైళ్లలో ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వెళ్ళడానికి చేయూతనందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కీలక నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర కేబినెట్...


భారతీయ రైల్వే ఇటీవలే మరిన్ని సేవలను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి సోను సూద్ వ్యక్తిగతంగా రైల్వే స్టేషన్ కు చేరుకొని  ఏర్పాట్లను పర్యవేక్షణ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రయాణికులకు భోజన వస్తు సామగ్రి, శానిటైజర్లతో సహా ప్రాథమిక అవసరాలను కూడా అందించాడు.  రైల్వే స్టేషన్ లో చాల మంది వలసకార్మికులను ఆప్యాయంగా పలకరించారు. ఇదిలాఉండగా సోనూసూద్ చేస్తున్న బాలీవుడ్, చిత్ర పరిశ్రమ నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. 


చివరగా సోనుసూద్ స్పందిస్తూ.. చివరి వలసకార్మికుడు ఇంటికి చేరే వరకు ఆగనని నేను ప్రతిజ్ఞ చేశానని, దీనికి సహకరించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..