కీలక నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర కేబినెట్...

ఆత్మ నిర్భర్ భారత్‌ పథకానికి మార్గదర్శకాలు‌ రూపొందిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్ డౌన్‌ కారణంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

Updated: Jun 1, 2020, 09:02 PM IST
కీలక నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర కేబినెట్...

న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర్ భారత్ (Atma Nirbhar Bharat Abhiyan)‌ పథకానికి మార్గదర్శకాలు‌ రూపొందిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్ డౌన్‌ కారణంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర  మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా విపత్కర పరిస్థితుల్లో ఉన్న రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

Also Read: AP CM YS Jagan: ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ

మరోవైపు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైతులు, ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో రైతులు, ఎంఎస్‌ఎంఈలదేనని స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీలతో పాటు ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు రూ.50వేలకోట్లు ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా వీధి వ్యాపారులను ఆదుకునేందుకు సత్వరమే రూ.10 వేలు రుణం ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించిందని, దీని ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..