Boom Boom Lacchanna Lyrical Song: డిఫరెంట్ టైటిల్‌తో పేక మేడలు అనే మూవీ తెరకెక్కుతోంది. నా పేరు శివ, అంధగారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన వినోద్ కిషన్ హీరోగా.. అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాంట్స్ ప్రొడక్షన్స్‌పై ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించగా.. వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విశ్వక్‌సేన్ రిలీజ్ చేయగా.. మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి బూమ్ బూమ్ లచ్చన్న అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sonakshi Sinha Marriage: సోనాక్షి, జహీర్ ల మధ్య  ఇంత ఏజ్ గ్యాప్ ఉందా.. ?


"లక్కు నీ వెంట.. కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న" అంటూ సాంగ్‌ను మొదలు పెట్టారు. ప్రముఖ సింగర్ మనో గాత్రం అందించగా.. భార్గవ్ కార్తీక్ లిరిక్స్ రాశారు. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. సాంగ్ చూస్తూ.. మూవీ పూర్తి వినోదాత్మకంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. డిఫరెంట్ టైటిల్‌కు తోడు మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా డిజైన్ చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. జూల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. 


==> నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్


టెక్నీషియన్స్ :


==> డైరెక్టర్: నీలగిరి మామిళ్ల
==> నిర్మాణ సంస్థ : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
==> ప్రొడ్యూసర్: రాకేష్ వర్రే
==> DOP: హరిచరణ్ కె.
==> ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
==> మ్యూజిక్ డైరెక్టర్: స్మరణ్ సాయి
==> లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
==> PRO: మధు VR


Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter