Brave Hearts Song: రియల్ లైఫ్‌ స్టోరీలకు రీల్‌ లైఫ్‌లో ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. వెండితెరపై చక్కగా ఆవిష్కరిస్తే.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల దర్శకనిర్మాతలతో పాటు ఆడియన్స్‌ కూడా ఇలాంటి స్టోరీలపై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే మూవీ తెరకెక్కుతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన  చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే ఓ దేశ భక్తి గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కు రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. రాము కుమార్ ఏఎస్కే సాహిత్యాన్ని అందించారు. ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని తట్టిలేపేలా ఉంది. 


 



ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం అవుతున్నాడు. మిహిరామ్ వైనతేయ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నాడు. దర్శకత్వంతోపాటు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తుండగా.. భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. 


Also Read: Salaar First Review: సలార్ ఫస్ట్ రివ్యూ... అవేవీ లేకపోయినా గూస్ బంప్స్ గ్యారంటీ


Also Read: Salaar Twitter Review: సలార్ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ అదిరిపోయింది.. ఆ ఒక్కటి మాత్రం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి