స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన సినిమా ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. ఇదివరకే విడుదలైన 'సామజవరగమణ', 'రాములో.. రాములా' పాటలతో పాటు అల వైకుంఠపురంలో ట్రైలర్ కూడా బన్నీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా విడుదలైన ‘బుట్టబొమ్మ’ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. రొమాంటింగ్ సాంగ్‌కు సైతం బన్నీ తనదైన స్టెప్పులతో అలరించగా.. పూజా అందం మరింత ప్లస్ అయింది. పాటకు తగ్గట్లుగా పూజా హెగ్డే ‘బుట్టబొమ్మ’లా కనిపిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


 


రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ రొమాంటింగ్ సాంగ్‌ను సింగర్ అర్మన్ మాలిక్ ఆలపించగాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూర్చాడు. కాగా, మ్యూజికల్ హిట్ అయిన ‘అల వైకుంఠపురం’ కోసం నిర్వహించిన మ్యూజిక్ కన్సార్ట్ సైతం విశేషంగా ఆకట్టుకుంది. సంక్రాంతి బరిలో ఉన్న సరిలేరు నీకెవ్వరు, ఎంత మంచివాడవురా సినిమాలతో పోటీ ఎదురైనా అల వైకుంఠపురం భారీ విజయాన్ని అందుకుంటుందని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..