దర్శకుడు బాబీపై కేసు నమోదు
సినీ దర్శకుడు బాబీ(కే.ఎస్. రవీంద్ర)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రముఖ సినీ దర్శకుడు బాబీ (కే.ఎస్. రవీంద్ర)పై పోలీసులు కేసు నమోదు చేశారు. మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఎదురుగా వెళ్తున్న ఓ కారును దర్శకుడు బాబీ ఢీ కొట్టాడు. దీంతో బాధితుడు హర్మీందర్ సింగ్.. బాబీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రమాదంలో తన తల్లి రీత్‌కౌర్‌కు బలమైన గాయమైందన్న హర్మిందర్.. ఇదేంటని ప్రశ్నిస్తుండగానే బాబీ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పవర్, గబ్బర్‌సింగ్-2, జై లవకుశ వంటి చిత్రాలకు బాబీ దర్శకత్వం వహించాడు. మే 20న ఆదివారం హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఆయన బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు బాబీ తన కారులో మితిమీరిన వేగంతో వస్తూ ఉండగా.. ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న బాబీ నిర్లక్ష్యంతో కారు నడుపుతూ తన కారును ఢీకొట్టి పారిపోయడని బాధితుడు ఆరోపించాడు.