ఉన్నట్టుండి కొండెక్కిన కోడి మాంసం ధరలు !
కోడి మాంసం ధరలకు రెక్కలొచ్చాయి
వరదల తర్వాత కరువు కోరల్లో చిక్కుకున్న కేరళలో కోడి మాంసం ధరలకు ఉన్నట్టుండి రెక్కలొచ్చాయి. వారం రోజుల క్రితం సుమారుగా రూ.100కు కాస్త అటు ఇటుగా పలికిన కేజీ చికెన్ ధరలు ప్రస్తుతం రూ.220 నుంచి రూ.240 వరకు చేరుకుంది. ఒక్క వారం రోజుల్లోనే చికెన్ ధరలు ఈ స్థాయిలో పెరగడం కేరళలో చర్చనియాంశమైంది. ఇటీవల వరదల్లో చాలావరకు పౌల్ట్రీ ఫామ్స్ నష్టపోగా తాజాగా జీఎస్టీ పెరగడంతో మరికొన్ని ఫామ్స్ మూసేయడం ఈ ధరల పెరుగుదలకు కారణాలయ్యాని తెలుస్తోంది.
కేరళలో పౌల్ట్రీ ఫామ్స్ తగ్గిపోవడంతో ప్రస్తుతం తమిళనాడు సరిహద్దుల్లోని పౌల్ట్రీ ఫామ్స్ నుంచి కోళ్లు కొనుగోలు చేస్తుండటం ధరల పెరుగుదలకు మరో కారణమైనట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అన్నింటికిమించి చికెన్ మార్కెట్‌లోనూ కార్పోరేట్ సంస్థలు శాసిస్తుండటంతో ధరల నియంత్రణకు అదుపు అనేది లేకుండాపోయింది అంటున్నారు కేరళ వాసులు.