టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్‌ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన మహేష్‌తో తొలిసారి జతకట్టగా... లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి తన మాటలతో మహేష్‌ బాబుతో పాటు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. పనిలో పనిగా రాజకీయాలు ప్రస్తావిస్తూ.. నన్ను అన్ని మాటలు ఎలా అన్నావంటూ విజయశాంతిని వేదికమీద అడిగారు చిరంజీవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘విజయశాంతి కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె గ్లామర్‌, వగరు, పొగరు అన్ని తగ్గాయని అనుకుంటున్నారా. దాదాపు 15 ఏళ్ల తర్వాత వచ్చినా అదే పొగరు, వగరు, గ్లామర్‌, అందం. విజయశాంతిని చూస్తుంటే గుండె జారిపోతుంది (మహేష్‌ బాబుతో పాటు అంతా నవ్వులే నవ్వులు). సినీ ఇండస్ట్రీ స్నేహితులను ఇస్తుంది. కానీ రాజకీయాలు మాత్రం గొడవలకు దారితీస్తాయి. సండే అననురా.. మండే అననురా అని చెప్పిన నా హీరోయిన్‌ విజయశాంతి నన్ను వదిలేసి వెళ్లిపోయింది. చాలా ఏళ్ల తర్వాత మహేష్‌ బాబు కారణంగా మళ్లీ మేం కలుసుకున్నాం. అందుకు సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్‌ వేదికైంది. 


చెన్నైలో మా ఇంటి దగ్గర్లోనే విజయశాంతి ఉండేది. మేమిద్దరం కలిసి 19, 20 సినిమాల్లో నటించాం. చాలా ఫ్రెండ్లీగా సినిమాలు చేశాం. నాకంటే ముందుగా ఆమె రాజకీయాల్లోకి వెళ్లారు. నన్ను ఆమె మాటలు అంది. మా స్నేహం కారణంగా నేను విజయశాంతిని ఒక్క మాట కూడా అనలేదు. ఆమె వెనకాల కూడా అనలేదని’ మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. చిరు చిలిపి మాటలతో ఫంక్షన్‌ నిజంగానే ఎంతో ఆహ్లాదకరంగా సాగిపోయింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..