గతకొంత కాలం వరకూ హాలీవుడ్ సినిమాలకు పరిచితమైన ‘హాలోవీన్’‌ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్‌కి కూడా పాకింది. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ హాలోవీన్ వేడుకను ఈసారి ఎంజాయ్ చేస్తూ హాయిగా జరుపుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ సభ్యులు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్, ఉపాసన, వరుణ్ తేజ్, నిహారిక, సుస్మిత, శ్రీజ మొదలైన వారు భయంకరమైన కొరివి దెయ్యాల వేషాలు వేసుకొని.. ఫోటోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అందరూ దెయ్యాల గెటప్స్ వేయగా.. సాయిధరమ్ తేజ మాత్రం చాలా హుందాగా ఉండే గెటప్‌లో దర్శనమిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చేతిలో బైబిల్ పట్టుకున్న మెంటలిస్ట్ గెటప్‌లో ఆయన  కనిపించారు. అలాగే ఉపాసన కూడా దెయ్యం వేషంలో తన అత్తయ్య సురేఖను ఆట పట్టిస్తున్న ఫోటోని ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోల్లో రామ్ చరణ్ తేజ కూడా చాలా మామూలు బట్టల్లో కనిపించడం విశేషం. మొత్తానికి మెగా ఫ్యామిలీ ఈ హాలోవీన్ పార్టీ సూపర్‌గా జరుపుకున్నారన్నది మాత్రం నిజం.


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "సైరా" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర యూనిట్ ఇటీవలే జార్జియాలో షూటింగ్ జరుపుకున్నాక.. హైదరాబాద్ తిరిగొచ్చింది. ఈ సినిమా యాక్షన్ ఘట్టాలు చిత్రీకరించడానికి హాలీవుడ్ ప్రముఖులను తీసుకొని రావడం జరిగింది. అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య  నిర్మిస్తున్నారు.     


[[{"fid":"175416","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"175417","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


[[{"fid":"175418","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


[[{"fid":"175419","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]