చిరంజీవి సినిమాలో రానా దగ్గుబాటి ?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీతో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల్లాగే ఈ సినిమా షూటింగ్ కూడా బ్రేక్ వచ్చింది. ఆచార్య మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయనున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీతో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల్లాగే ఈ సినిమా షూటింగ్ కూడా బ్రేక్ వచ్చింది. ఆచార్య మూవీ షూటింగ్ ( Aacharya movie shooting ) పూర్తయిన తర్వాత రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయనున్నాడు. మలయాళం సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ( Lucifer Telugu remake ) తెరకెక్కనున్న సినిమా ఇది. అయితే, లూసిఫర్ తెలుగు రీమేక్ తర్వాత చిరంజీవి ఏ చిత్రానికి సైన్ చేయనున్నారనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. లూసిఫర్ రీమేక్ తర్వాత చిరంజీవి కె.ఎస్.రవీంద్ర (బాబీ) లేదా మెహర్ రమేష్ డైరెక్షన్‌లో సినిమా చేయవచ్చని గత కొద్దిరోజులుగా ఫిలింనగర్ ఓ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Also read : 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రానికి 30 ఏళ్లు
అయితే, తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్న టాక్ ప్రకారం చిరంజీవి మాత్రం బాబీ వినిపించిన స్క్రిప్ట్‌పైనే ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. రవీంద్ర చెప్పిన స్టోరీ లైన్ చిరుకు బాగా నచ్చిందని, అదే స్టోరీ లైన్‌కి ఇంకొన్ని మార్పులు చేయమని చిరు కోరడం జరిగిందని టాలీవుడ్ వర్గాల టాక్. అంతేకాదు... కేఎస్ రవీంద్ర డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు రానా దగ్గుబాటి ( Chiranjeevi, Rana Daggubati multi-starrer ) కూడా నటించనున్నారని సమాచారం. వెంకీ మామ మూవీతో వెంకీతో సినిమా చేసిన బాబీ.. ఇప్పుడు అబ్బాయి రానా దగ్గుబాటితో సినిమా ప్లాన్ చేస్తున్నాడన్న మాట.
Also read : SSC exams 2020 : పాత హాల్ టికెట్స్‌తోనే 10వ తరగతి పరీక్షలు.. సర్కార్ కీలక నిర్ణయం
చిరంజీవి, రానా దగ్గుబాటి కోసం రవీంద్ర ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. అదే కానీ నిజమైతే.. తొలిసారిగా మరో సూపర్ కాంబినేషన్‌లో సినిమా చూసే అవకాశం టాలీవుడ్ ఆడియెన్స్‌కి రావొచ్చేమో!! జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..