హైదరాబాద్: కరోనా.. ఈ పేరు వినగానే  ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఒకే ఆందోళన. ఇది మొదటగా 1-3 రోజుల వ్యవధిలో గొంతు నుంచి ఊపిరితిత్తులు, అక్కడ్నుంచి రక్తంలోకి ప్రవేశిస్తుందని, శరీరంపై ప్రభావం (Coronavirus symptoms) చూపగానే మొదట జ్వరం వస్తుందని, గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి మూడో రోజు నుంచి కనిపిస్తాయని నిపుణులు తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also:  గుజరాత్‌లో పొలిటికల్ డ్రామా..!!


మూడు నుండి నాలుగు రోజుల మధ్య ఈ వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుందని, దీంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తి,  తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. తొమ్మిది రోజులు గడిచేసరికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుందని, కొంతమందిలో గ్యాస్ట్రిక్‌ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.  


Also Read: మైనర్‌పై పలుమార్లు అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక


కాగా, ఊపిరితిత్తులకు చేరిన ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి ప్రవేశిస్తుందని, ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి అని, ప్రాణాంతకమైన సెప్సిస్‌ (బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌) ఒక వారం తర్వాత మొదలవుతుందని అన్నారు. మరోవైపు 3 వారాల తర్వాత రోగనిరోధక శక్తి అధికంగా ఉండి మరే ఇతర జబ్బులు లేని వారు మూడు వారాలు చికిత్స అందిస్తే కరోనాను జయించడం సులభమే అని, హైపర్‌ టెన్షన్‌ వంటి వ్యాధులు ఉండి వయసు పైబడిన వారికి ఈ వైరస్‌ను ఎదుర్కోవడం కష్టమని నిపుణులు తెలియజేస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..


Read Also: ఎన్నికల కమిషన్ పై వైఎస్ జగన్ ఫైర్