మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ దిల్ రాజు  పట్టిందల్లా బంగారంలా మారుతోంది. దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే మినిమం సక్సెస్ గ్యారంటీ. ఫిదా మూవీతో మొదలైన దిల్ రాజు విజయపరంపరా ..ఇప్పటి వరకు కొనసాగుతోంది. ఆయన ఏ సినిమా తీసినా హిట్టే అనే స్థాయికి చేరకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజ్ తరుణ్ కు ఛాన్స్


వెండితెరకు అంతాగా తెలియని సాధారణ హీరోలతో మోస్ట్ సక్సెస్ పుల్ మూవీస్ తీయడమే దిల్ రాజు స్పెషాలిటీ.. ఈ క్రమంలో దిల్ రాజు ప్లాపుల బాట పడుతున్న ‘లవర్’ మూవీ హీరో రాజ్ తరుణ్ పై కన్నేశాడు. ఈ యంగ్ హీరోకు తన నెక్ట్స్ మూవీలో నటించే బంపర్ ఆఫర్ ఇచ్చాడట. రాజు గారి దగ్గరి నుండి బంప్ ఆఫర్ వస్తే ఎవరైనా వద్దంటారా ?.. రాజ్ తరుణ్ వెంటనే కళ్ళు మూసుకుని యస్ అనేశాడట .


రాజునే అనుగ్రహంతో మళ్లీ మెరిసేనా ?
 జెట్ స్పీడ్ లో సక్సెస్ అయి వెండితెరకు పరిచమైన రాజ్ తరుణ్ ..అంతే స్పీడ్ తో  సైలెంట్ మోడ్ లో ఉన్నాడు రాజ్ తరుణ్.  సినిమాలన్నాక ఫ్లాపులు.. హిట్లు కామనే కానీ... కానీ అదే పనిగా రిలీజైన ప్రతి సినిమా బోల్తా పడుతుందంటే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్టే. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే రియలైజ్ అయిన రాజ్ తరుణ్ కి ఈ సారి కంప్లీట్ గా దిల్ రాజు పై డిపెండ్ అవుతున్నాడు. మరి రాజు సరసన చేరిన రాజ్ తరుణ్ ఏ మేరకు సక్సెక్ అవుతాడో వేచిచూడాల్సిందే


కొత్త డైరెక్టర్ వైపే మొగ్గు..


రేపో మాపో సెట్స్ పైకి రాబోతున్న దిల్ రాజు మూవీ కోసం కొత్త డైరెక్టర్ నే ఎంపిక చేశాడట. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన రామకృష్ణా రెడ్డి, ఈ సారి మరింత డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సెట్స్ పైకి వస్తున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే  ఈ మూవీకి మిక్కీ.జే.మేయర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాడట.