Kaliyugam Pattanamlo: ఆ గర్భవతి చెప్పినా వినలేదు.. `కలియుగం పట్టణంలో` కథ అప్పుడే పుట్టింది: డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి
Kaliyugam Pattanamlo Release Date: సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన కలియుగం పట్టణంలో మూవీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న థియేటర్ల ముందుకు రానుంది. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
Kaliyugam Pattanamlo Release Date: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ 'కలియుగం పట్టణంలో'. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 29న ఆడియన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి నేడు మీడియాతో చిత్రవిశేషాలను పంచుకున్నారు. కలియుగం పట్ణణంలో ఊరిపేరు కాదని.. కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారు..? ఓ పట్టణంలో అక్కడి మనుషుల గురించి సినిమాలో చూపించామన్నారు. సినిమా కథ నంద్యాల దగ్గర్లోనే నల్లమల ఫారెస్ట్ ఉంటుందని.. ఫారెస్ట్‌కి, ఔషధ మొక్కలకు లింక్ ఉంటుందన్నారు. అందుకే నంద్యాలలో షూటింగ్ చేశామన్నారు.
Also Read: Siblings Died: ఘోర సంఘటన.. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ నలుగురు చిన్నారులు మృతి
సస్పెన్స్ థ్రిల్లర్‌తోపాటు మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని.. లవ్, యాక్షన్, మెసేజ్ కూడా ఉంటుందని తెలిపారు రమాకాంత్ రెడ్డి. హీరో మెంటల్ హాస్పిటల్‌లో ఉన్న దగ్గరి నుంచి స్టోరీ మొదలవుతుందని.. దాన్ని తెరపై చూస్తే బాగుంటుందన్నారు. తన కొడుకు ఇలా ఉండాలి.. ఇది చేయాలని.. సమాజం ఏం అంటుందోనని చాలా మంది తండ్రులు సోషియో ఫోబియాతో ఉన్నారని.. పిల్లల ఫీలింగ్స్ పట్టించుకోరని.. వాటికి తగ్గట్టు కథలో ఆ పాయింట్ కూడా చూపించామన్నారు.
"నేను బెంగుళూరు నుంచి బస్సులో ఊరికి వెళ్తున్నప్పుడు ఓ ప్రెగ్నెంట్ మహిళ సైకాలజీ బుక్ చదువుతోంది. నేను ఆ మహిళతో మాట్లాడుతూ.. ప్రెగ్నెంట్‌గా ఉండి ఇలాంటి బుక్ చదవకూడదని చెప్పాను. ఏం చేయాలో నాకు తెలుసంటూ ఆమె సమాధానం ఇచ్చింది. ఆమె దాదాపు 5 గంటలు అదే బుక్ చదివింది. నాకు అప్పుడు ఈ కథ ఐడియా వచ్చింది. బయట పిల్లలు ఎలా పెరుగుతున్నారో మనం చూస్తున్నాం. ఇలా కథ రాసుకున్నా.
నేను డిగ్రీ చదవే సమయంలో అరుంధతి మూవీకి కోడి రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశా. అప్పటి నుంచి సినిమాలపై బాగా ఆసక్తి కలిగింది. వైజాగ్‌లో చదివేటప్పుడు కూడా సినిమాల్లో తిరిగా. హైదరాబాద్‌కు వచ్చి వెళ్తూ.. కొన్ని సినిమాల్లో పని చేశా. ఆ తరువాత కొంతమంది దర్శకుల వద్ద పనిచేశా. కొన్ని మూవీస్‌కు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశా. నేను కరోనా సమయంలో కథ రాసుకుని.. కొంతమంది హీరోలను కలిశాను. ఇంటెన్స్ క్యారెక్టర్‌ను వాళ్లు చేయలేమని చెప్పారు. అప్పుడు విశ్వ ప్రొఫైల్‌ను చూసి అప్రోచ్ అయ్యాను. స్టోరీ చెప్పిన తరువాత విశ్వ చేస్తానని చెప్పాడు. విశ్వ గత సినిమాల్లో సాఫ్ట్‌గా కనిపిస్తే.. ఈ సినిమాలో డిఫరెంట్‌గా కనిపిస్తాడు. ఈ మూవీ విశ్వ కెరీర్‌లో ఒక మార్క్‌గా నిలిచిపోతుంది.
హీరోయిన్ ఆయుషి పటేల్ తెలుగమ్మాయి. చాలా చక్కగా నటించింంది. మరో హీరోయిన్ చిత్రశుక్ల పోలీస్ రోల్‌లో నటించింది. ఒన నిర్మాత మా కజిన్ మహేష్. ఆ తరువాత కథ నచ్చి ఓబుల్ రెడ్డి గారు, రమేష్ గారు వెంటనే సినిమా చేసేందుకు ఒకే చెప్పారు. ఈ సినిమాలో మెసేజ్‌కు కాలేజీ స్టూడెంట్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. ఓబుల్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చి వాళ్ల కాలేజీలో, కడపలో షూట్ చేయమన్నారు. మూడు షెడ్యూల్‌లో షూటింగ్ అయిపోయింది. నా మొదటి సినిమానే అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్‌ను తప్పకుండా మెప్పిస్తాం. త్వరలో ఈ మూవీకి సీక్వెల్ కలియుగ నగరంలో పేరుతో సినిమా తీస్తున్నా.." అని రమాకాంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Scooty Riding: నువ్వు సూపర్ భయ్యా.. స్కూటీ రైడింగ్ చేస్తూ జూమ్ మీటింగ్.. వైరల్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook