హైదరాబాద్: అద్భుతమైన ప్రేమ చిత్రాలు నిర్మించిన దర్శకుడు తేజ, మళ్ళీ పాత ట్రాక్ ఎక్కబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.  తన మొదటి చిత్రం నుంచి ప్రేమకథా చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చిన తేజ, ఆ తరువాత విభిన్నమైన కథలను తెరపై ఆవిష్కరించాడు. విజయాలను స్వీకరిస్తూ .. అపజయాలను అంగీకరిస్తూ అయన తన కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చాడు. ఆ మధ్య ఆయన దర్శకత్వంలో వచ్చిన 'సీత'  చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.


ఇదిలా ఉండగా డైరెక్టర్ తేజ, ప్రస్తుతం రెండు కథలపై కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ, వాటిపై స్పష్టత రాలేదు. నేడు తేజ పుట్టినరోజు, కాగా  ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాలకి సంబంధించి రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించాడు. ఒక టైటిల్ 'అలివేలుమంగ - వెంకటరమణ' అయితే, మరో టైటిల్ 'రాక్షస రాజు రావణాసురుడు' ఈ రెండింటిలో ఒక సినిమాలో రానా .. మరో సినిమాలో గోపీచంద్ నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన మిగతా వివరాలను ఆయన త్వరలో తెలియజేయనున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..