ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు తేజకి (Director Teja) క‌రోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇటీవల జరిగిన ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో డైరెక్టర్ తేజ పాల్గొన్నాడు. ఈ షూటింగ్ అనంతరం యూనిట్ సభ్యుల్లో ఒకరికి కొద్దిపాటి కరోనా లక్షణాలు ( Coronavirus symptoms) కనిపించినట్టు తెలుస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వెబ్ సిరీస్ షూటింగ్ కోసం పనిచేసిన యూనిట్ సభ్యులు, వారికి సమీపంగా వచ్చిన వాళ్లు అందరికీ కరోనా పరీక్షలు చేయించగా.. డైరెక్టర్ తేజ మినహా అందరికీ నెగటివ్ వచ్చి ఆయనకు మాత్రం పాజిటివ్ అని నిర్ధారణ అయింది. డైరెక్టర్ తేజ కుటుంబసభ్యులకు కూడా కొవిడ్-19 టెస్టులు ( COVID-19 tests) చేయగా.. వారికి నెగటివ్ అనే వచ్చింది. కరోనా పరీక్షల అనంతరం తేజ హోమ్ క్వారంటైన్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: నొప్పి లేకుండా చనిపోవడం ఎలా..? గూగుల్‌లో వెతికిన Sushant


ఇదిలావుంటే, ఇటీవలే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ( Director SS Rajamouli) సైతం క‌రోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కొద్దిపాటి జ్వరం వచ్చి తగ్గిన అనంతరం ఎంతైనా మంచిదనే ముందు జాగ్రత్తతో కరోనా పరీక్షలు చేయించుకోగా... అందులో మైల్డ్ పాజిటివ్ అని తేలిందని.. ప్రస్తుతం కుటుంబసభ్యులం అందరం హోమ్ క్యారంటైన్‌లో ( Home quarantine) ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తున్నామని స్వయంగా రాజమౌళినే ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. Also read: TikTok: కొనుగోలు చేయనున్న మైక్రోసాఫ్ట్