Domino vs Swiggy-Zomato: డొమినో పిజ్జా ఇకపై స్విగ్గీ-జొమాటోల్లో ఆర్డర్ చేయలేరు, ఎందుకంటే
Domino vs Swiggy-Zomato: ఇంట్లోనో లేదా ఆఫీసులోనో లేదా మరెక్కడో హాయిగా కూర్చుని స్విగ్గీ, జొమాటో బటన్ ప్రెస్ చేసి పిజ్జా ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా..ఇక అదేం కుదరదు. డోమినో పిజ్జాలు ఇకపై స్విగ్గీ, జొమాటో సేవల్లో ఉండవు. ఎందుకు, ఏమైంది, లెట్స్ హ్యావ్ ఎ లుక్
Domino vs Swiggy-Zomato: ఇంట్లోనో లేదా ఆఫీసులోనో లేదా మరెక్కడో హాయిగా కూర్చుని స్విగ్గీ, జొమాటో బటన్ ప్రెస్ చేసి పిజ్జా ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా..ఇక అదేం కుదరదు. డోమినో పిజ్జాలు ఇకపై స్విగ్గీ, జొమాటో సేవల్లో ఉండవు. ఎందుకు, ఏమైంది, లెట్స్ హ్యావ్ ఎ లుక్
డొమినో పిజ్జా అంటే అందరికీ చాలా ఇష్టం. ఇక నుంచి ఈ పిజ్జా కావాలంటే ఆ పిజ్జా సెంటర్‌కు వెళ్లాల్సిందే లేదా డొమినో పిజ్జా డోర్ డెలివరీని సంప్రదించాలి. స్విగ్గీ నుంచో లేదా జొమాటో నుంచి ఠక్కున ఆర్డర్ చేయలేరిక. ఇంతకాలం హాయిగా ఇంట్లో కూర్చుని..పిజ్జా ఆర్డర్ చేసే పరిస్థితి ఇప్పుడు జొమాటో, స్విగ్గీల్లో ఎందుకు లేదు. ఏమైంది అసలు..ఆ వివరాలు తెలుసుకోవల్సిందే..
ఇండియాలో డొమినో రన్ చేస్తున్న జూబిలియంట్ ఫుడ్‌వర్క్స్ సంస్థ..ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీల యాంటీ కాంపిటిటివ్ పద్ధతులపై దర్యాప్తు కోసం సీసీఐతో చేతులు కలిపింది. ఫలితంగా ఇండియాలోని పిజ్జా ఫ్రాంఛైజీ కొన్ని వ్యాపారాలను జొమాటో, స్విగ్గీలకు దూరంగా ఉంచాలనుకుంటోంది. సీసీఐ అంటే కాంపిటిషన్ కమీషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థతో కలిసి జొమాటో, స్విగ్గీల యాంటీ కాంపిటిటివ్ పద్ధతులపై దర్యాప్తుకు నడుం బిగించింది జూబిలియంట్ ఫుడ్‌వర్క్స్. ఇండియాలో పిజ్జా ఫ్రాంచైజీ నడిపేది ఈ సంస్థే.
జూబిలియంట్స్ ఫుడ్‌వర్క్స్ అనేది దేశంలో అతిపెద్ద ఫుడ్ సర్వీసెస్ సంస్థ. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 16 వందల బ్రాండెడ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో 1567 డొమినో, 28 డంకిన్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఈ సంస్థ తరపున సీసీఐ ఇప్పటికే జొమాటో, స్విగ్గీలపై దర్యాప్తుకు ఆదేశించింది. అయితే యాంటీ కాంపిటిటివ్ పద్ధతులు చేస్తున్నామనే ఆరోపణల్ని జొమాటో, స్విగ్గీలు తోసిపుచ్చాయి. స్విగ్గీ, జొమాటోలు ఎక్కువ కమీషన్ డిమాండ్ చేయడం కూడా ఓ కారణంగా ఉంది. ఒకవేళ కమీషన్ ఎక్కువగా ఉంటే..తమ వ్యాపారాన్ని ఇన్‌హౌస్ ఆర్డరింగ్ సిస్టమ్‌కు బదిలీ చేసే ఆలోచనల్లో జూబిలియంట్ ఫుడ్‌వర్క్స్ ఉంది.
చైనాకు చెందిన యాంట్ గ్రూప్ సపోర్ట్‌తో నడుస్తున్న జొమాటో..రెస్టారెంట్ భాగస్వాముల కమీషన్ పెంచాలనే ఆలోచన లేదని వెల్లడించింది. తమ షేర్ హోల్డర్లపై ప్రభావం చూపించే వాణిజ్యపరమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపింది. స్మార్ట్‌ఫోన్స్, భారీ డిస్కౌంట్ల ఆఫర్లతో ఇండియాలో ఫుడ్ డెలివరీ వేదికలు ప్రాచుర్యం పొందుతున్నాయి. మరోవైపు 2021 డిసెంబర్ క్వార్టర్ నాటికి డొమినో యాప్‌ను 8.2 మిలియన్ రెట్లు ఇన్‌స్టాల్ చేసుకున్నారని..ఫలితంగా సొంత యాప్ ద్వారా అమ్మకాలు కూడా పెరిగాయంటోంది.
స్విగ్గీ, జొమాటోపై మరో ఆరోపణ
అదే సమయంలో 5 లక్షలకు పైగా సభ్యులున్న నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా సీసీఐకు జొమాటో, స్విగ్గీలపై ఫిర్యాదు చేసింది. జొమాటో, స్విగ్గీలు తీసుకుంటున్న 20-30 శాతం ఛార్జ్ అనేది అన్యాయంగా ఉందనేది ఆ ఫిర్యాదు సారాంశం.
Also read: ITR Filing last Date: ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు మరో వారం రోజులే గడువు, ఏ డాక్యుమెంట్లు అవసరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.