ఫాలోవర్స్‌కు సంబంధించిన తాజా డేటాను ట్విట్టర్ విడదల చేసింది. ఈ సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ 67 శాతం నకిలీ ఫాలోవర్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తేలింది.   బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిధరూర్, భారత ప్రధాని మోడీ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరందరికీ సిసలైన ఫాలోవర్లకంటే నకిలీ ఫాలోవర్లు ఉండటం గమనార్హం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోడీకి 60 శాతం నకిలీ ఫాలోవర్స్ 
భారత ప్రధాని మోడీకి సంబంధించిన మొత్తం 60 శాతం నకిలీ ఫాలోవర్స్  ఉన్నట్లు తేలింది. తాజా డేటా ప్రకారం ప్రధాని మోడీకి 40,993,053 మంది ఫాలోవర్స్ ఉండగా..వాటిలో 24,799,527 ఫాలోవర్స్ నకిలీవని తేల్చారు. వాస్తవానికి ప్రధాని మోడీకి  సిసలైన ఫాలోవర్స్  16,191,426 మాత్రమేనని తేల్చింది.


సిసలైన ఫాలోవర్స్ లో ట్రంప్ టాప్
వాస్తవిక ప్రపంచంలో పెద్దగా ప్రజాదరణ లేని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ కు సోషల్ మీడియాలో మాత్రం అసలు సిసలు ఫాలోవర్లను కలిగి ఉన్నట్లు తేలింది. నకిలీ ఫాలోవర్ల విషయంలో ఆయన మన నేతల కంటే చాలా తక్కువగా అంటే 37 శాతం మాత్రమే కలిగి ఉండటం గమనార్హం.