వివాదాస్పదమైన సన్నీ లియోన్ బోల్డ్ ఫ్యామిలీ ఫోటో
బోల్డ్ ఫ్యామిలీ ఫోటో పేరుతో సన్ని లియోన్ భర్త డేనియల్ వెబర్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఛాయాచిత్రం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
బోల్డ్ ఫ్యామిలీ ఫోటో పేరుతో సన్ని లియోన్ భర్త డేనియల్ వెబర్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఛాయాచిత్రం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఒంటి పై ఏ అచ్ఛాదనా లేకుండా ఉన్న సన్నీ లియోన్ శరీరాన్ని తన బిడ్డ కప్పగా.. ఆమె పక్కనే జీన్ ప్యాంటు ధరించిన భర్తతో కలిసి దిగిన ఫోటో పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫోటోని బోల్డ్ ఫోటో అనే కన్నా.. సిగ్గమాలిన ఫోటోగా పేర్కొనాలని కొందరు ట్రోల్ చేశారు.
అయితే సన్ని లియోన్ అభిమానులు ఆ ట్రోల్స్‌కి స్పందించారు. ఆ ఫోటోని గౌరవప్రదంగా చూడాలని.. వేరే విధంగా చూడవద్దని తెలిపారు. పలువురు "ఆమె జీవితం.. ఆమె ఇష్టం.. మీ పర్మిషన్ తీసుకొని కూడా ఫోటోలు పోస్టు చేయాలా.." అని బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సన్ని లియోన్ ఎంటీవీ రియాలిటీ షో "స్ప్లిట్స్ విల్లా"లో పార్టిసిపేట్ చేస్తోంది. అలాగే "వీరమదేవి" అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. అదే విధంగా సన్నీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ "కరణ్ జీత్" కూడా త్వరలో జీ5లో ప్రసారం కానుంది.