నిర్మాత కూతురికి కరోనా.. క్వారంటైన్‌లో కుటుంబం
కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus Positive cases) రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,067కి చేరుకోగా అందులో ప్రస్తుతం 3,666 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus Positive cases) రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,067కి చేరుకోగా అందులో ప్రస్తుతం 3,666 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 291 మంది వ్యాధి నయమై డిశ్చార్జ్ అయ్యారు. 109 మంది మృతి చెందారు. ఈరోజు ఒక్క రోజే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 693 పాజిటివ్ కేసులు నమోదైనట్టు హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. ముంబైలో బాలీవుడ్ చిత్ర నిర్మాత కరీం మొరానీ కూతురు షాజా మొరానీకి (Karim Morani’s daughter Shaza Morani) కూడా కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఆదివారం ఆమెను నానావతి ఆస్పత్రిలో చేర్పించారు. షాజా మొరానీ ట్రావెల్ హిస్టరీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మొరానీ కుటుంబసభ్యులు మొత్తం క్వారంటైన్‌లో ఉన్నారు. అనంతరం కుటుంబసభ్యులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
Photos: సామాన్యుడి నుంచి మోదీ వరకు చిరుదివ్వెలు
షారుఖ్ ఖాన్ నటించిన రా వన్, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలె చిత్రాలను నిర్మించిన కరీం మొరానీకి పరిశ్రమలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. బాలీవుడ్‌కి చెందిన వారిలో కరోనావైరస్ బారిన పడిన వారిలో షా కుటుంబం రెండోది. తొలుత మార్చి నెలలోనే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. తొలుత ఐదు పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన తర్వాత ఆరో పరీక్షల్లో ఆమెకు నెగటివ్ ఫలితం వచ్చింది. ఆ తర్వాతే ఆమె లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS) నుండి డిశ్చార్జ్ అయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..