Krishnam Raju: కృష్ణంరాజు జయంతి వేడుకలు.. మొగల్తూరులో భారీ వైద్య శిబిరం
Krishnam Raju Birth Anniversary: కృష్ణంరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొగల్తూరులో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా.. ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు వెయ్యి మందికిపైగా పేషంట్స్ హాజరయ్యారు.
Krishnam Raju Birth Anniversary: రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఆయన స్వస్థలం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో, కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి వెయ్యి మందికి పైగా పేషెంట్స్ హాజరయ్యారు. మనదేశంతో పాటు యూకే, యూఏఈ దేశాలకు చెందిన సుమారు 40 మంది నిష్ణాతులైన వైద్యులు ఈ శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందించారు. డయాబెటిక్ ఫుట్ ఉచిత స్క్రీనింగ్, మందులు, కౌన్సెలింగ్ అందించారు.
ఇండియా వైద్య బృందానికి హైదరాబాద్ జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ శేషబత్తారు సారథ్యం వహించారు. భీమవరంలోని డా.వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైద్యులు డా.వర్మ, ఇంపీరియల్ హాస్పిటల్ వైద్యులు డా. నరేష్ ఈ వైద్య శిబిరంలో తమ సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన రోగులను అడాప్ట్ చేసుకుని వాళ్లకు భవిష్యత్ లోనూ కావాల్సిన వైద్య సహాయం అందిస్తామని డాక్టర్స్ తెలిపారు.
ఈ వైద్య శిబిరం విజయవంతం కావడంపై శ్యామలాదేవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. "కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడం ఆనందంగా ఉంది. డయాబెటిక్ పుట్ సమస్యలతో వచ్చిన ఎంతోమంది పేషెంట్స్ మా క్యాంప్ లో వైద్య సహాయం పొందడం ఎంతో సంతృప్తిని కలిగించింది. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించి, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనేది కృష్ణంరాజు గారి కల. ఆయన ఆశయాల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం.." అని చెప్పారు.
కృష్ణంరాజు కూతురు ప్రసీద మాట్లాడుతూ.. "నాన్నగారి కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు అమ్మ శ్యామలాదేవి ఎంతో పట్టుదలగా కృషి చేసింది. పేద ప్రజలు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలనేది అమ్మ సంకల్పం కూడా. ఈ వైద్య శిబిరంలో అమ్మ తన పేరును మొదటగా రిజిస్టర్ చేసుకుంది. భవిష్యత్ లోనూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహిస్తాం.." అని చెప్పారు.
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఈ విశేషాలు తెలుసా..
Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్ వంశీయులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter