Game On: సరికొత్త కాన్సెప్ట్‌తో గేమ్ ఆన్ మూవీ.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్
Game On Release Date: డిఫరెంట్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన గేమ్ ఆన్ మూవీ విడుదలకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
Game On Release Date: గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గేమ్ ఆన్. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న గేమ్ ఆన్ మూవీ.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రొడ్యూసర్ రవి కస్తూరి మాట్లాడుతూ.. గేమ్ ఆన్ మూవీ రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందని చెప్పారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు సాంగ్స్‌కు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. త్వరలోనే మిగిలిన సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేస్తామన్నారు. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
రథం చిత్రంతో హీరోగా గీతానంద్ మంచి పేరు తెచ్చుకున్నాడని.. ఈ మూవీతో హీరోగా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తాడన్న నమ్మకం ఉందన్నారు. నేహ సోలంకి తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుందని చెప్పారు. డైరెక్టర్ దయానంద్ కథ చెప్పిన దానికన్నా కూడా తెరపై అద్భతంగా తెరకెక్కించాడని ప్రశంసించారు. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చిందని.. ఈ మూవీ కోసంమంచి స్టార్‌క్యాస్ట్ తీసుకున్నామని తెలిపారు. మధుబాల కీలక పాత్ర పోషించారని.. గతంలో ఎన్నడూ చేయని క్యారెక్టర్‌లో నటించారని తెలిపారు. న్యూఏజ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ తప్పకుండా కనెక్ట్ అవుతుందన్నారు. డిఫెరెంట్ స్టోరీలతో వచ్చిన సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారని.. తమ సినిమాను కూడా హిట్ చేస్తారని నమ్మకం ఉందన్నారు.
డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ.. ఈ మూవీలోని పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయని తెలిపారు. ప్రతి క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి.. రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు..? ఆ ఆటలోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు..? అసలు ఆ గేమ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి..? ఈ ఆటను ఎవరు ఆడిస్తున్నారు..? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ మూవీని తెరకెక్కించినట్లు వెల్లడించారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు. కచ్చితంగా తమ సినిమా ఆడియన్స్‌కు సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందన్నారు. ఈ మూవీకి మ్యూజిక్ అభిషేక్ ఏఆర్ అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా అరవింద్ విశ్వనాథన్, ఎడిటర్‌గా వంశీ అట్లూరి వ్యవహరించారు.
Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter