గత రెండు రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) దిగొస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి క్షీణించాయి. బంగారం ధర ఇదివరకే రూ.50 వేల కిందకి దిగిరాగా, తాజాగా మరోసారి ధరలు తగ్గాయి. పసిడి దారిలోనే వెండి పయనిస్తూ ధర భారీగా క్షీణించింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.180  మేర దిగొచ్చింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,580 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,450కి క్షీణించింది.



 


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Price in Delhi) పతనమయ్యాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.180 మేర దిగొచ్చాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బం గారం 10 గ్రాముల ధర రూ.51,810కి తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.160 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,500కి పతనమైంది.



 


బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా వెండి ధరలు (Silver Rate in India) పతనమవుతున్నాయి. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.450 మేర దిగొచ్చింది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.59,600 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook