ముంబై: బంగారం ధరలురోజురోజుకు దిగువకు చేరుకుని, పసిడి ప్రియులకు మరీంత ఊరట కలిగిస్తున్నాయి. అయితే వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్‌మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. రూపీ బలోపేతం కావడం, దేశీయ ఆభరణాల డిమాండ్ తగ్గడం వల్ల ధరల్లో పతనం కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతకుముందు మంగళవారం బంగారం 10 గ్రాములకు రూ.41,267 వద్ద ఉంది. 


మరోవైపు వెండి ధర కిలోకు రూ.179 తగ్గి రూ.46,881కు పడిపోయింది. అంతకుముందు మంగళవారం వెండి కిలోకు 47,060 రూపాయల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎనిమిది పెరిగింది. ప్రపంచ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 1,554 డాలర్లు, వెండి ఔన్సుకు 17.70 డాలర్లుగా ఉంది. చైనా సూచీలలో స్థిరత్వం, ప్రపంచ మార్కెట్ల పెరుగుదల కారణంగా బంగారం ధరలు తగ్గాయని బిజినెస్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..