Hotel Service Charge: సామాన్యులకు గుడ్‌న్యూస్..ఇకపై సర్వీస్ ఛార్జీలు ఉండవు..!
Hotel Service Charge: వినియోగదారులకు శుభవార్త అందింది. సర్వీస్ ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలకు ఎందుకు వసూలు చేస్తున్నారని మండిపడింది.
Hotel Service Charge: రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీస్ ఛార్జీల నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్గనుంది. ఆహార బిల్లులపై డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ విధించకూడదని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) స్పష్టం చేసింది. ఈమేరకు తీర్పును వెల్లడించింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇతర పేర్లతోనూ సేవా రుసుము వసూలు చేయకూడదని తెలిపింది.
ఆహార బిల్లుకు సర్వీస్ ఛార్జ్ ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదని..దానిపై జీఎస్టీ(GST) సైతం విధించకూడదని తేల్చి చెప్పింది. ఇటీవల సర్వీస్ ఛార్జీల అంశం తీవ్ర దుమారం రేగింది. వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. రంగంలోకి దిగిన ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసింది. సర్వీస్ ఛార్జీల అంశంపై మంతనాలు జరిపింది. నేషనల్ రెస్టారెండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI)తో తొలి సమావేశం నిర్వహించింది. కేంద్రం ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం(DOCA) సర్వీస్ ఛార్జీ విధించవద్దని తెలిపింది.
ఈమేరకు కొత్త నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇకపై ఫుడ్ బిల్లులపై ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఉండవని అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. సర్వీస్ ఛార్జీలను పేరు మార్చి వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. హోటళ్లు, రెస్టారెంట్ల తీరు మారకపోతే హెల్ప్ లైన్ నెంబర్ 1915లో ఫిర్యాదు చేయాలని సీసీపీఏ సూచించింది. మాములుగా మనం రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి ఆర్డర్ తీసుకున్న తర్వాత చివర్లో సేవా రుసుము విధిస్తారు. ఇటీవల ఇది సర్వ సాధారణమైంది. బిల్లులో ఒక శాతం నుంచి 5 శాతంగా దీనిని వసూలు చేస్తున్నారు.
Also read:CM Jagan: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి..ప్రధాని మోదీకి సీఎం జగన్ వినతిపత్రం..!
Also read:God Father: మెగా అభిమానులకు ఇక పునకాలే.. గాడ్ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్‌డేట్..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook