God Father: మెగా అభిమానులకు ఇక పునకాలే.. గాడ్‌ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..!

God Father: తన అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ట్రీట్ ఇచ్చారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. 

Written by - Alla Swamy | Last Updated : Jul 4, 2022, 06:32 PM IST
  • అభిమానులకు చిరంజీవి ట్రీట్
  • గాడ్‌ ఫాదర్ నుంచి అప్‌డేట్‌
  • ఫస్ట్‌ లుక్‌ విడుదల
God Father: మెగా అభిమానులకు ఇక పునకాలే.. గాడ్‌ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..!

God Father: తన అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ట్రీట్ ఇచ్చారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. గాడ్ ఫాదర్ ఫస్ట్‌ లుక్‌ను హీరో రామ్‌ చరణ్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ఈసినిమాను దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్‌గా సినిమా రూపొందుతోంది. దీంతో ఈమూవీపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్‌లుక్‌లో నల్ల కళ్లద్దాలు ధరించి, జేబులో పెన్ను పెట్టుకుని చిరు హుందాగా కనిపిస్తున్నారు. తన హెయిర్, వాకింగ్ స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. 

చిరు పక్కన నటుడు సునీల్ సైతం అలరిస్తున్నాడు. ఇటు తమన్‌ బీజీఎం అదిరిపోయింది. చిరుకు తగ్గట్టు తమన్ మ్యూజిక్ అందించాడు. మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్‌ లుక్‌ విడుదలతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు అంబరాన్ని తాకాయి. సోషల్‌ మీడియా వేదికగా విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి 153వ మూవీగా గాడ్ ఫాదర్ పట్టాలు ఎక్కుతోంది. ఇందులో సల్మాన్‌ ఖాన్, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. 

ఈఏడాది విజయదశమికి గాడ్ ఫాదర్ మూవీ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. ఈసినిమాతోపాటు భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో మరో మూవీని చిరు చేస్తున్నారు. మరోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి డైరెక్షన్‌లోనూ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Also read:Chandrababu: దేశానికే అల్లూరి గర్వకారణం..పార్లమెంట్‌లో విగ్రహం ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు..!

Also read:Minister Harish Rao: తెలంగాణపై మరోసారి విషం కక్కారు..మోదీ, షాపై హరీష్‌రావు ధ్వజం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News