గూగుల్ పే ఉపయోగించి తొలిసారి పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్, బహుమతులు వస్తుంటాయి. కానీ కాలక్రమంలో క్యాష్‌బ్యాక్ తగ్గిపోయింది. అయితే దీని గురించి దిగులుపడాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ పాటిస్తే ప్రతి లావాదేవీపై వంద రూపాయలవరకూ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోన్ పేతో పోలిస్తే..గూగుల్ పేలోనే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎక్కువ. అలాంటిది ఈ మధ్యన గూగుల్ పేలో కూడా క్యాష్‌బ్యాక్ తగ్గిపోయింది. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా 3 లేదా 5 రూపాయలకే పరిమితమౌతోంది. అయితే కొన్ని సూచనలు, ట్రిక్స్ పాటిస్తే క్యాష్‌బాక్ పొందవచ్చు. ఆ చిట్కాలు తెలుసుకుందాం.


గూగుల్ పే యాప్ ఓపెన్ చేసినప్పుడు వివిధ రకాల ఆఫర్లు, వివిధ కేటగరీల్లో కన్పిస్తుంటాయి. ఆ ప్లాన్స్ ఎంచుకుంటే క్యాష్‌బ్యాక్ లేదా రివార్డులు వస్తుంటాయి. గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు లేదా పెట్రోల్ బిల్లు చెల్లించేటప్పుడు తప్పకుండా ఉంటుంటాయి. అందుకే ఈ మూడు బిల్లుల్ని తప్పకుండా గూగుల్ పే ద్వారా చెల్లించేందుకు ప్రయత్నిస్తే..క్యాష్‌బ్యాక్ కచ్చితంగా వస్తుంది. 


ఇక మరో ట్రిక్ మీరు పంపించాలనుకున్న నగదు మొత్తాన్ని చిన్న చిన్న మొత్తాల్లో వేర్వేరు ఎక్కౌంట్ల నుంచి పంపించడం. అంటే ఒకే ఎక్కౌంట్ నుంచి కాకుండా వేర్వేరు ఎక్కౌంట్ల నుంచి పంపిస్తే క్యాష్‌బ్యాక్ అందే అవకాశాలు పెరుగుతాయి.


అదే విధంగా గూగుల్ పే క్యాష్‌బ్యాక్ పొందేందుకు మరో ట్రిక్..పెద్దమొత్తంలో ఎప్పుడూ నగదు పంపించవద్దు. మీరు పంపించాలనుకున్న నగదను చిన్న చిన్న మొత్తాల్లో విభజించి పంపిస్తే క్యాష్‌బ్యాక్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జనవరిలోనే వరుసగా శుభవార్తలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook